హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొత్తులుండవు: గౌడ్, మేం వ్యతిరేకమే: మోత్కుపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu-Devender Goud
హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. శాసనసభలో బలం నిరూపించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించాలని ఆయన కోరారు. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో ప్రభుత్వం మైనారిటీలో పడిందనేది స్పష్టమైందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ కార్యకర్తల అండదండలతో అన్ని ప్రాంతాల్లో తాము ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. సహకార సంఘాల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తుకు తమ పార్టీ అనుకూలమని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం చెప్పిన విషయం తెలిసిందే. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన నేపథ్యంలో దేవేందర్ గౌడ్ శనివారం వివరణ ఇచ్చారు.

కాంగ్రెసులోని అంతర్గత విభేదాలను తమ పార్టీపై రుద్దడం సమంజసం కాదని తెలుగుదేశం శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాంగ్రెసు విధానాలకు వ్యతిరేకంగానే తెలుగుదేశం ఆవిర్భవించిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుమ్మక్కయ్యారని కాంగ్రెసు ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రజా మద్దతుతోనే తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Telugudesam Rajyasabha member T Devender Goud clarified that TDP will not make alliance with any party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X