హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరుణ హత్య కేసు: చంచల్‌గుడా జైలుకు శివకుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shiva Kumar
హైదరాబాద్: తీవ్ర సంచలనం సృష్టించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థిని అరుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు. శివకుమార్‌ను హైదరాబాదులోని ఛత్రినాక పోలీసులు పూణే నుంచి శనివారం ఉదయం హైదరాబాదు తీసుకుని వచ్చారు. వెంటనే అతన్ని న్యాయమూర్తి ఎదుట ఆయన నివాసంలో హాజరు పరిచారు.

నిరుడు డిసెంబర్ 31 తేదీన అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే శివకుమార్ మహారాష్ట్రకు పారిపోయాడు. అరుణ శివకుమార్ నివాసంలోనే మరణించింది. శివకుమార్ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అరుణ హత్య కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్‌ను పోలీసులు జనవరి 4వ తేదీన పూణే నుంచి రైలులో తీసుకుని వస్తుండగా అతను వేగంగా పరుగు తీస్తున్న రైలు నుంచి కిందికి దూకాడు.

రైలు నుంచి కిందికి దూకడంతో శివకుమార్ కుడి చేయి, ఎడమ కాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో అతని కాలును, చేతిని వైద్యులు తొలగించారు. అప్పటి నుంచి అతను పూణే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం కుదుట పడడంతో శివకుమార్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రైలునుంచి దూక ఆత్యహత్యకు ప్రయత్నించినందుకు గాను అతనిపై పూణేలో కూడా కేసు నమోదైంది.

అరుణ హత్య కేసులో పోలీసులు ప్రభు, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్ చదివిన అరుణ శివకుమార్ నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శివ కూడా ఒయు నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. క్రిస్ట్మస్ వేడుకల కోసం శివకుమార్ తల్లిదండ్రులు మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూడడంతో అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది.

English summary
Shivakumar, main accused in Osmania University student Aruna, has been remanded for 14 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X