వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెదిరించారు, అందుకే రాలేదు: సల్మాన్ రష్దీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Salman Rushdie
కోల్‌కతా: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కోల్‌కతాలో అడుగుపెడితే మూటకట్టి వెనక్కి పంపేస్తాం' అంటూ తనను హెచ్చరించినట్టు ఆరోపించారు. దానివల్ల గత నెల 30వ తేదీన కోల్‌కతాకు వెళ్లలేకపోయానని అన్నారు. ఈ మేరకు ఒక పేజీ ప్రకటనను మీడియాకు విడుదల చేసి దేశం విడిచిపోయారు.

ట్విటర్‌లో ఆయన తన వాదనను వినపించారు. గతనెల 30వ తేదీన కోల్‌కతా సాహిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఆయన నవలకు సినిమా రూపం'మిడ్‌నై ట్ చిల్డ్రన్' ప్రచార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కోల్‌కతా వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నానని, మరుసటి రోజు బయలుదేరతాననగా కోల్‌కతా పోలీసులు తనను సంప్రదించారని, ఎట్టిపరిస్థితుల్లో నగరంలోకి అడుగుపెట్టవద్దన్నారని ఆయన చెప్పారు.

పర్యటన గురించి కావాలనే మీడియాకు, ముస్లిం సంస్థలకు మీరు ఉప్పందించారని ఆయన ఆరోపించారు. ఎందుకు రాకూడదని తాను అడిగితే, కోల్‌కతాలో మత ఘర్షణలు రేపే ఉద్దేశం దీని వెనక కనిపిస్తోందని, దీనివల్ల కోల్‌కతాకు మీరు రాకూడదనేది మమత ఆదేశమని, కాదని వచ్చారా.. తరువాతి విమానంలోనే మిమ్మల్ని మూటకట్టి వెనక్కి పంపించేస్తామని తన విజ్ఞప్తిగా మీకు మా ముఖ్యమంత్రి చెప్పమన్నారని వారు స్పష్టం చేసినట్లు రష్దీ వివరించారు.

అయితే, రష్దీని తామేమీ పిలవలేదని సాహిత్య సమ్మేళనం నిర్వాహకులు వేరే ప్రకటనలో స్పష్టం చేశారు. దానిపై రష్దీ స్పందిస్తూ.. అది అమర్యాదకరమని, వాళ్లే తన విమానం టెకెట్లు బుక్ చేశారన్నారు. మమత ఒత్తిడి వల్లే వాళ్లలా మాట్లాడి ఉండొచ్చని ఆరోపించారు.

English summary
Salman Rushdie has issued statement on his aborted Kolkata visit. "Here is the full account: I arrived in Delhi on January 22nd at the invitation of the distributors of the film of my novel Midnight's Children. The plan was to visit four cities, Delhi, Bangalore, Kolkata and Mumbai, culminating in the Mumbai premiere of the movie on January 31st" he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X