వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిపై ఎమ్మెల్యే అలక కలకలం: రాజీనామా హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prabhakar
ఏలూరు: తనపై నమోదైన కేసుల విషయంలో పార్టీ అధిష్టానం, జిల్లా పార్టీ నేతలు స్పందించడం లేదని భావిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలక వహించారు. పార్టీ తన విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. తనపై కేసులు నమోదైనా, పోలీసులు వేధిస్తున్నా పార్టీ అండగా నిలవడం లేదని ఆయన శనివారం ఆరోపించారు.

పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ శనివారం పార్టీ నేతలను హెచ్చరించారు. కొందరు సీనియర్ నేతలు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు. చంద్రబాబు స్పందించారు. పరిణామాలను చక్కదిద్దాల్సిందిగా మిగతా నేతలను ఆదేశించారు. రాజీనామా వ్యవహారం డ్రామా మూడు గంటల పాటు సాగింది. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే అనుచరులు జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

దీంతో జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబులు చర్చించారు. తర్వాత వారు బాబుకు చెప్పారు. మరోవైపు పలువురు పార్టీ నేతలు చింతమనేని ప్రభాకర్‌పై పెట్టిన కేసుల అంశాన్ని డిజిపితో పాటు మరికొందరు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.

పెదవేగి ఎస్ఐ మోహనరావుపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలతో చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు అరెస్టు చేస్తారనే సమాచారం మేరకు ఆయన వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ తనకు అండగా నిలవడం లేదని అసంతృప్తికి గురై.. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారట. ఆదివారం ఉదయం జిల్లా పార్టీ నేతలు ఈ విషయంపై చర్చించేందుకు సమావేశమయ్యారు.

English summary
TDP MLA unhappy with Party High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X