వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిల రాక్ బ్యాండుకు బెదిరింపు: కేసు నమోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: అమ్మాయిల రాక్ బ్యాండు ప్రదర్శనలపై నెట్‌లో బెదిరింపులు రావడంపై జమ్ము కాశ్మీర్ పోలీసులు స్పందించారు. ఇంటర్‌నెట్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశారు. ఇంటర్నెట్లోని ఫేస్‌బుక్ ద్వారా వచ్చిన పలు బెదిరింపులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఐటి యాక్ట్ 66ఏ, ఆర్పీసి 506 సెక్షన్ల క్రింద వారిపై కేసు నమోదు చేశారు.

విచారణ జరుపుతున్నామని చెప్పిన పోలీసులు పూర్తి వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఫేస్‌బుక్‌లో బెదిరింపులకు పాల్పడ్డ వారిలో కనీసం ఆరుగురు వ్యక్తులను సైబర్ క్రైమ్ సెల్ నిపుణుల సహాయంతో గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వారిని కూడా గుర్తించే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. ముగ్గురు అమ్మాయిల ప్రగాష్ రాక్ బ్యాండ్ ఫేస్ బుక్ పేజ్ ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున మెసేజ్‌లు అందుకుంది.

అందులో ఎక్కువ మొత్తం వారిని బెదిరింపులకు గురి చేసినవే. ఫేస్ బుక్ పేజీలో బెదిరింపులకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు ఒకటి రెండు రోజుల్లో వారిని అరెస్టు చేయవచ్చు. మరోవైపు అమ్మాయిలకు మొదట మద్దతిస్తూ ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఆ తర్వాత దానిని తొలగించారు. అంతేకాదు బషీరుద్దీన్‌ను ప్రభుత్వం నియమించిందని చెప్పారు.

కాగా జమ్మూ కాశ్మీరులో ఉన్న ఓ బాలికల రాక్ బ్యాండ్ బృందానికి మత ప్రబోధకుడు బషీరుద్దీన్ ఫత్వా జారీ చేసిన కారణంగా రాక్ బ్యాండ్ బృందం మూగబోనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న ఏకైక బాలికల రాక్ బ్యాండ్ బృందం 'ప్రగాష్'(వెలుగు). అయితే, పాటలు పాడటం ఇస్లామ్‌కు వ్యతిరేకమని, వెంటనే రాక్ బ్యాండును నిలిపివేయాలని బషీరుద్దీన్ అహ్మద్ ఫత్వా జారీ చేశారు. ఆయన ఫత్వా జారీ చేసిన తెల్లవారు నుండి ప్రగాష్ మూగబోయింది.

FIR filed against those who threatened Kashmir Girls band

రాక్ బ్యాండ్ బృందం ప్రదర్సనలు ఇవ్వవద్దని ఆన్‌లైన్‌లో బెదిరింపులు కూడా వచ్చాయట. ఫత్వా జారీ చేయడం, ఆన్ లైన్‌లో బెదిరింపుల నేపథ్యంలో ముగ్గురు అమ్మాయిలతో కూడిన ప్రగాష్ రాక్ బ్యాండ్ బృందం తమ ప్రదర్శనలను నిలిపివేసింది. అయితే వీటిపై వారు పెదవి విప్పడం లేదు. ఫత్వా నేపథ్యంలో సంగీత ప్రదర్శనలు ఇవ్వకూడదని వారు నిర్ణయించుకున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.

పాటలు పాటడం ఇస్లామిక్ ప్రబోధాలకు వ్యతిరేకమని, దీనివల్ల సమాజంలో ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించలేరని తాను చెప్పానని, పాడటాన్ని ఆపాలని బాలికలకు సూచించినట్లు బషీరుద్దీన్ చెప్పారు. పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు నోమా నజీర్, ఫరా దీబా, అనీకా ఖలీద్‌లు గత డిసెంబరులో జరిగిన వార్షికోత్సవ సంగీత పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చారు. దాంతో వారు వెలుగులోకి వచ్చారు.

ప్రగాష్ పేరిట వారు రాక్ బ్యాండును ఏర్పాటు చేసిన తొలి పోటీలోనే ఉత్తమ ప్రదర్శన అవార్డును గెలుచుకున్నారు. అప్పటి నుండి వారికి ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చాయి. అయితే ప్రగాష్ రాక్ బ్యాండుకు ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మద్దతు పలికారు. బాలికలకు బషీరుద్దీన్ జారీ చేసిన ఆదేశాన్ని తన ట్విట్టర్‌లో తోసిపుచ్చారు. మూర్ఖులు చేసిన వ్యాఖ్యలను పట్టించుకొని పాటలు పాడటాన్ని ఆపొద్దని సూచించారు. ప్రతిపక్ష పిడిపి అధ్యక్షురాలు ముఫ్తీ కూడా దీనిని ఖండించారు. ఇలాంటి వల్ల మతానికి చెడ్డపేరు వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
The netizens who recently threatened three members of an all-girl rock band "Pragaash" in Jammu and Kashmir have been booked under a controversial section of the Information Technology Act, police said here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X