వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్: సవాళ్లను అవకాశంగా తీసుకుంటూ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: పట్టణీకరణ సవాళ్లను వ్యవస్థీకృత విధానం ద్వారా అవకాశంగా మార్చుకుని అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం బాటలు వేస్తోంది. ఈ విషయంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన ఫేస్‌బుక్‌లో వివరించారు. కొద్ది వారాల క్రితం తాను సబర్మతీ తీరానికి పతంగుల ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు సాంస్కృతిక వైభవం కనిపించిందని అన్నారు. ఏళ్ల క్రితం ఇదే ప్రాంతం భిన్నంగా ఉండేదని, తీరంపై పిల్లలు క్రికెట్ ఆడుతుండేవారని, సర్కస్ జరుగుతుండేదని అన్నారు.

గత కొద్ది ఏళ్లలో సబర్మతీ ప్రాంతం, దాని పరిసరాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. సబర్మతీ నది ఏడాది అంతా ప్రవహిస్తుండడమే కాకుండా అదో పర్యాటక, వినోద ప్రాంతంగా మారిపోయిందని, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని చెప్పారు.

నదీతీరంపై చేసిన పనుల వల్ల నీటి మట్టం పెరిగిందని, నీటి సంబంధ వ్యాధులు తగ్గాయని, విద్యుచ్ఛక్తి వినియోగం తగ్గిందని ఆయన చెప్పారు. ఈ పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టు విదేశీ నిపుణుల ప్రశంసలు కూడా అందుకుందనిన ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయి నగరాలకు, పట్టణాలకు దీటుగా సబర్మతీ తీర్మాన్ని తీర్చి దిద్డడానికి తాము కృత నిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. భారతదేశంలో అత్యధిక పట్టణీకరణ గల రాష్ట్రాల్లో గుజరాత్ ఒక్కటి.

పట్టణీకరణ ఎన్నో సవాళ్లను ముందుకు తెస్తుంది. ఆ సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని గుజరాత్ ప్రభుత్వం గుర్తించింది. కాలుష్యం, రవాణా వంటి సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి విశేష కృషి చేస్తున్నట్లు నరేంద్ర మోడీ తెలిపారు.

గుజరాత్: సవాళ్లను అవకాశంగా... (ఫొటోలు)

సబర్మితీ తీరం ఇలా వినోద, పర్యాటక కేంద్రంగా మారిపోవడమే కాకుండా, నీటి మట్టం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గింది. వర్షాకాలంలో వచ్చే జబ్బులు తగ్గుముఖం పట్టాయి. ఏడాది అంతా నీరు ఉంటోంది.

గుజరాత్: సవాళ్లను అవకాశంగా... (ఫొటోలు)

నగరీకరణ సవాళ్లను ఎదుర్కోవడానికి రవాణా సౌకర్యాలు పెంచాల్సి ఉంటుంది. రహదారులు జనాభా పెరుగుదలకు అనుగుణంగా, అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని గజరాత్‌లోని నగరాల్లో ఫ్లైఓవర్లు నిర్మించారు. సూరత్ ఫ్లైఓవర్ సిటీగా పేరు సాధించింది.

గుజరాత్: సవాళ్లను అవకాశంగా... (ఫొటోలు)

నగర రవాణా మౌలిక సదుపాయాలను పెంచే ప్రయత్నాల్లో ఏ మాత్రం గుజరాత్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించలేదు. అందుకు గాను మల్టీ మోడల్ అఫర్డెబుల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

గుజరాత్: సవాళ్లను అవకాశంగా... (ఫొటోలు)

నగరాల్లో దిగగానే మనం రేడియో టాక్సీ, కాల్ ఎ క్యాబ్ వంటి వాటి వైపు చూస్తాం. కానీ, గుజరాత్ అందుకు భిన్నంగా ఉంది. ఆటో డ్రైవర్లందరూ ఒక గొడుగు కిందికి వచ్చి జీ-ఆటోను ఏర్పాటు చేశారు. 24 గంటలు వారు సేవలు అందిస్తారు. ఆటోలో కూర్చోగానే డ్రైవర్ వాటర్ బాటిల్, న్యూస్ పేపర్ ఇస్తాడు. ఈ సౌకర్యం అహ్మదాబాద్, వడదొర, గాంధీనగర్‌ల్లో ఉంది. మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గుజరాత్: సవాళ్లను అవకాశంగా... (ఫొటోలు)

పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో వసతి సౌకర్యం ఓ సవాల్‌గా మారుతోందని ముందుగానే పసిగట్టిన గుజరాత్ ప్రభుత్వం ప్రజలకు మంచి వసతి సౌకర్యాలకు ప్రణాళికలు రచించింది. మురికివాడలు లేని నగరాలను దృష్టిలో పెట్టుకని గృహ నిర్మాణ పథకాలను చేపడుతోంది.

గుజరాత్: సవాళ్లను అవకాశంగా... (ఫొటోలు)

ఆహ్మదాబాద్‌తో పాటు గాంధీనగర్ కూడా వెలిగిపోవాలని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారు. అందుకు గాను జంటనగరాల నమూనాను అభివృద్ధి చేస్తున్నారు. అహ్మదాబాద్ - గాంధీ నగర్, సురేంద్రనగర్ - వాద్వాన్, సూరత్ - నవసారి, వడదొర - హలోల్, భరూచ్ - అంకలేశ్వర్, మోర్పి - వాంకనేర్ జంటనగరాలను అభివృద్ధి చేస్తున్నారు.

గుజరాత్: సవాళ్లను అవకాశంగా... (ఫొటోలు)

జంటనగరాల అభివృద్ధి ప్రణాళికలను మాత్రమే కాకుండా శివారు పట్టణాల నిర్మాణ ప్రణాళికలను కూడా గుజరాత్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

English summary
"This landmark transformation of the Sabarmati Riverfront is a part of our larger determination to transform Gujarat’s cities into world-class urban spaces. It is a fact that in this day and age, urbanization is here to stay. A large number of people are being drawn to the cities" Gujarat CM Narendra Modi says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X