వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాలెంట్‌కి అడ్డు:గర్ల్స్‌ర్యాక్ బ్యాండుకు నో, ఆపొద్దని సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kashmiri girl band falls silent
శ్రీనగర్: జమ్మూ కాశ్మీరులో ఉన్న ఓ బాలికల రాక్ బ్యాండ్ బృందం ప్రదర్శనలు ఇక నుండి ఉండవు. మత ప్రబోధకుడు బషీరుద్దీన్ ఫత్వా జారీ చేసిన కారణంగా రాక్ బ్యాండ్ బృందం మూగబోనుంది. రాష్ట్రంలో ఉన్న ఏకైక బాలికల రాక్ బ్యాండ్ బృందం 'ప్రగాష్'(వెలుగు). అయితే, పాటలు పాడటం ఇస్లామ్‌కు వ్యతిరేకమని, వెంటనే రాక్ బ్యాండును నిలిపివేయాలని బషీరుద్దీన్ అహ్మద్ ఫత్వా జారీ చేశారు. ఆయన ఫత్వా జారీ చేసిన తెల్లవారు నుండి ప్రగాష్ మూగబోయింది.

రాక్ బ్యాండ్ బృందం ప్రదర్సనలు ఇవ్వవద్దని ఆన్‌లైన్‌లో బెదిరింపులు కూడా వచ్చాయట. ఫత్వా జారీ చేయడం, ఆన్ లైన్‌లో బెదిరింపుల నేపథ్యంలో ముగ్గురు అమ్మాయిలతో కూడిన ప్రగాష్ రాక్ బ్యాండ్ బృందం తమ ప్రదర్శనలను నిలిపివేసింది. అయితే వీటిపై వారు పెదవి విప్పడం లేదు. ఫత్వా నేపథ్యంలో సంగీత ప్రదర్శనలు ఇవ్వకూడదని వారు నిర్ణయించుకున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.

పాటలు పాటడం ఇస్లామిక్ ప్రబోధాలకు వ్యతిరేకమని, దీనివల్ల సమాజంలో ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించలేరని తాను చెప్పానని, పాడటాన్ని ఆపాలని బాలికలకు సూచించినట్లు బషీరుద్దీన్ చెప్పారు. పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు నోమా నజీర్, ఫరా దీబా, అనీకా ఖలీద్‌లు గత డిసెంబరులో జరిగిన వార్షికోత్సవ సంగీత పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చారు. దాంతో వారు వెలుగులోకి వచ్చారు.

ప్రగాష్ పేరిట వారు రాక్ బ్యాండును ఏర్పాటు చేసిన తొలి పోటీలోనే ఉత్తమ ప్రదర్శన అవార్డును గెలుచుకున్నారు. అప్పటి నుండి వారికి ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చాయి. అయితే ప్రగాష్ రాక్ బ్యాండుకు ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మద్దతు పలికారు. బాలికలకు బషీరుద్దీన్ జారీ చేసిన ఆదేశాన్ని తన ట్విట్టర్‌లో తోసిపుచ్చారు. మూర్ఖులు చేసిన వ్యాఖ్యలను పట్టించుకొని పాటలు పాడటాన్ని ఆపొద్దని సూచించారు. ప్రతిపక్ష పిడిపి అధ్యక్షురాలు ముఫ్తీ కూడా దీనిని ఖండించారు. ఇలాంటి వల్ల మతానికి చెడ్డపేరు వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Kashmir's first all-girls rock band, Pragaash, which means light, may fell silent soon. Online threats from conservatives and worried parents are putting pressure on the girls to shun music once for all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X