హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ ఏడాదే ఎన్నికలు రావచ్చు, సిద్ధం కండి: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఈ ఏడాదే ఎన్నికలు రావచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యవర్గ సమావేశం వివరాలను పార్టీ నాయకుడు నాయని నర్సింహా రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. పల్లెబాటను మార్చి 21వ తేదీ వరకు పొడగించాలని, ఆ తర్వాత పల్లెబాటపై నివేదికలు అందజేయాలని కెసిఆర్ ఆయా జిల్లాల నేతలకు సూచించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ నేతను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 2వ తేదీన తలపెట్టిన విజయవాడ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని తెలంగాణ జెఎసితో మాట్లాడి వాయిదా వేయిద్దామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 24వ తేదీన జరిగే బెంగళూర్ రహదారి దిగ్బంధంలో పాలమూరు జిల్లా నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు.

ఏప్రిల్‌లో తెలంగాణ జిల్లాల్లో కెసిఆర్ బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. తెరాస కార్యవర్గ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. హైదరాబాదు నగరంలోని చారిత్రక ప్రదేశాలకు ఆటంకం లేకుండా మెట్రో రైలు మార్గాన్ని అండర్ గ్రౌండ్ ద్వారా నిర్మించాలని తెరాస ప్రభుత్వానికి సూచించింది. రాయితీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 12కు పెంచాలని, విద్యాత్ చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరింది.

సహకార సంఘాల ఎన్నికలు మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యుల కనుసన్నల్లో జరిగాయని, కాంగ్రెసు గోల్‌మాల్ చేసి ఈ ఎన్నికల్లో గెలిచిందని నాయని నర్సింహారెడ్డి విమర్సించారు. తెరాస కార్యవర్గ సమావేశంలో మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కూడా పాల్గొన్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao said that elections may be held this year. He addressed the TRS executive committee meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X