వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ది దొంగ దీక్ష: షర్మిల ఆపరేషన్‌పై గోనె కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాలికి ఆపరేషన్ కాలేదని, అదే నిజమైతే వివరాలు బయటపెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ్ రావు కౌంటర్ ఇచ్చారు. షర్మిల ఆపరేషన్ పైన కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం అని ఆయన విమర్సించారు. తమకు అవాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

2009లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే తెలంగాణ పేరుతో దొంగ దీక్ష చేశారని ఆరోపించారు. కెసిఆర్ దొంగ దీక్ష బండారం బయట పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కెసిఆర్ వైద్య పరీక్షల వివరాలను కవితకు తాను పంపిస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో తమ పార్టీకి వస్తున్న ప్రజా స్పందనను తెలంగాణ రాష్ట్ర సమితి జీర్ణించుకోలేక పోతోందన్నారు.

తమ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తోందని, దీనిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే తమ పార్టీకి మద్దతు పలుకుతున్నారని కెకె మహేందర్ రెడ్డి అన్నారు. కానీ తెరాస నేతలకే ఈ విషయం అర్థం కావడం లేదన్నారు. వారి కుటుంబ లబ్ధికే వారు తెలంగాణవాదాన్ని ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో పుట్టిన రంగారెడ్డి జిల్లాకు పెంపుడు కొడుకు అని రంగారెడ్డి జిల్లా నేతలు అన్నారు.

షర్మిలతో అనిల్ కుమార్

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను పునఃప్రారంభించనున్న షర్మిల తుర్కయాంజల్‌కు చేరుకుంది. గతేడాది డిసెంబర్ 15న ఆగిన ఆమె పాదయాత్ర ఈ రోజు తిరిగి ప్రారంభమవుతోంది. ఇంటి వద్ద సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం ఆమె పాదయాత్ర కోసం హైదరాబాదు నుండి బయలుదేరారు. ఆమె వెంట మాజీ మంత్రి కొండా సురేఖ, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌లు ఉన్నారు.

English summary
Former RTC chairman Gone Prakash Rao lashed out at TRS chief K Chandrasekhar Rao on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X