వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షీ! తర్వాత సుప్రీంపైనా?: జగన్‌పత్రికపై లోకేష్ ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మరోసారి ట్విట్టర్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక పైన విమర్శలు గుప్పించారు. హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌వి రమణపై సాక్షి పత్రికలో రాసిన వార్త ఆధారంగా వేసిన కేసులో సుప్రీం కోర్టు ఇద్దరు న్యాయవాదులకు అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. సాక్షి పత్రిక వార్తను సుప్రీం తప్పు పట్టింది.

దీనిపై లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. బెదిరించేందుకు, హింసించేందుకు, నీచమైన ప్రచారం చేసేందుకు సాక్షి పత్రిక ఒక పరికరంగా ఉపయోగపడుతోందని సుప్రీం కోర్టు తీర్పుతో తేలిందన్నారు. ఆ తర్వాత సాక్షి పత్రికను ఉద్దేశించి.. సాక్షీ! మీ తర్వాతి వార్త సుప్రీం కోర్టు పైనేనా? అంటూ ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 5న మంగళవారం రోజున ఆయన ట్విట్టర్‌లో ఈ కామెంట్ చేశారు.

కాగా నారా లోకేష్ తరుచూ ట్విట్టర్‌లో జగన్ పార్టీ, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన పలుమార్లు ట్వీట్స్ చేశారు. గత డిసెంబర్‌లో హెరిటేజ్‌పై దాడిని నిరసిస్తూ... లోకేష్ ట్వీట్ చేశారు. మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయంటూ భారత దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుండగానే కొందరు హెరిటేజ్ స్టోర్స్ పైన దాడి చేసి మహిళలపై అటాక్ చేశారన్నారు. వారిని ఎవరిని పంపించారంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

అంతకుముందు అఖిల పక్ష సమావేశంలో టిడిపి తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పడంపై స్పందిస్తూ.. హరీష్, నీ అటెండర్ పోస్టు దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భవన్ ఎదురు చూస్తోందని రాశాడు. అలాగే కెటిఆర్, రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని రాశాడు. హరీష్ రావు అటెండర్ పోస్టు దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భవనం ఎదురు చూస్తోందని, కెటిఆర్ రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని ఆతను ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

English summary
Recent SC verdict showed that Sakshi is used as a tool to harass, blackmail & malign. Sakshi, will your next article be on the SC bench?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X