వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tsunami alert after Solomon Islands earthquake
వాషింగ్టన్: సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం వచ్చింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలు పైన 8గా నమోదయింది. దీంతో దక్షిణ పసిఫిక్ దీవిల్లో సునామీ హెచ్చరికలను న్యూజిలాండులోని సునామీ హెచ్చరికల కేంద్రం జారీ చేసింది. సోలోమన్ దీవుల్లో వచ్చిన భారీ భూకంపం కారణంగా సునామీ వస్తే అది పలు దేశాలపై ప్రభావం ఉంటుందని సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. దక్షిణ పసిఫిక్ దీవుల్లో సునామీ రావొచ్చునని పేర్కొంది.

హవాయి దీవులకు మాత్రం ప్రమాదం లేదని తెలిపింది. సోలోమన్‌లరో వచ్చిన భారీ భూకంపం కారణంగా దీవుల్లో పలు ఇళ్లు నేల మట్టమయ్యాయి. నీటి అలల తాకిడికి కూడా కొంత నష్టం జరిగింది. దాదాపు పదమూడు గ్రామాలను నీరు ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. సునామీ హెచ్చరికలతో దక్షిణ పసిఫిక్‌లోని పన్నెండు దేశాలు అప్రమత్తమయ్యాయి. భూకంపం సోలోమన్ దీవుల్లోని శాంటాక్రజ్ ద్వీపంలో చోటు చేసుకుంది.

భూకంప కేంద్రం కిరాకిరాకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. భూకంప కేంద్రం భూమిలోపల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని మొదట చెప్పిన అమెరికా జియోలాజికల్ సర్వే ఆ తర్వాత 28 కిలోమీటర్లకు పైగా లోతులో ఉందని తెలిపింది. భూకంపం కారణంగా సోలోమన్ దీవిలో పలు గ్రామాలు నేల మట్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అయితే అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

సునామీ హెచ్చరికలను సోలోమన్ దీవులు, వనౌతు, నౌరు, న్యూగినియా, తువాలు, న్యూ కొలెడోనియా, కోస్రా, ఫిజి, కిరిబాతి, వాల్లిస్, ఫుతునా ప్రాంతాలకు జారీ చేశారు. కాగా 2007లో వచ్చిన సునామీ కారణంగా 52 మంది మరణించారు. దీంతో ఇప్పుడు ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి.

English summary
A magnitude 8.0 earthquake off the Solomon islands has sparked a Tsunami warning for the many island nations of the South Pacific, with houses reported damaged in the Solomon by a comination of the quake itself and the resulting tidal suge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X