వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'షర్మిలను చూడ్డానికే వస్తున్నారు, ప్రజలు ఓట్లేయరు'

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
నల్లగొండ/మెదక్/న్యూఢిల్లీ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి షర్మిలను చూడడానికి మాత్రమే ప్రజలు వస్తున్నారని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పాదయాత్రకు వస్తున్నవారంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయరని ఆయన శుక్రవారం నల్లగొండలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన అన్నారు.

దోచుకున్నది దాచుకోవడానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, షర్మిల పాదయాత్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చి ఆస్తులను కాపాడుకోవాలని వారు చూస్తున్నారని ఆయన అన్నారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచినంత మాత్రాన తెలంగాణవాదులు బలహీనపడినట్లు కాదని ఆయన అన్నారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు విజయం కార్యకర్తలదేనని, రాష్ట్ర నాయకులది కాదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని రాజకీయంగా బతికించడానికి మాత్రమే తెలంగాణ జెఎసి, దాని చైర్మన్ కోదండరామ్ పనిచేస్తున్నట్లు కాంగ్రెసు శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెసు మైనారిటీలో పడలేదని, మెజారిటీలోనే ఉందని ఆయన శుక్రవారం మెదక్ జిల్లాలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు లేదని ఆయన అన్నారు. తెరాస పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాదని ఆయన అన్నారు.

కాంగ్రెసును తిడితే తెలంగాణ రాదని ఆయన అన్నారు. ఆవేశంలో తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. ఎన్నికలే లక్ష్యంగా తెరాస పనిచేస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని లక్ష్యం చేసుకోవాలని తెరాస, తెలంగాణ జెఎసి భావిస్తున్నాయని, అందుకనే ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

సహకార సంఘాల ఎన్నికలతో, తెలంగాణకు సంబంధం లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కృషి ఫలితంగానే సహకార సంఘాల ఎన్నికల్లో తాము విజయం సాధించామని ఆమె అన్నారు. కాంగ్రెసు పని అయిపోయిందని అన్నవాళ్లకు సహకార ఫలితాలు సమాధానమని ఆమె అన్నారు. ఉప ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ప్రస్తుతం ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ఆమె అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు.

English summary
Congress Rajyasabha member Palwai Govardhan Reddy said that public is interested to see Sharmila, as she is a daughter of YS Rajasekhar Reddy, but YSR Congress will not get votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X