వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీపై సిబిఐ: సుప్రీం కోర్టు చివాట్లు, తొగాడియాపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ/ముంబై: ఉత్తర ప్రదేశ్‌లోని బాబ్రీ కూల్చివేత కేసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ, తదితరులు జాతీయ నేరానికి పాల్పడ్డారని సిబిఐ పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కూల్చివేతను జాతీయ నేరంగానో, ప్రాముఖ్యం ఉన్న జాతీయ అంశంగానో అభివర్ణించవద్దని, దీనిపై కోర్టు నిర్ణయం వచ్చే వరకు అలాంటి ప్రకటనలు చేయొద్దని జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని సుప్రీం బెంచ్ మందలించింది. బిజెపి, విహెచ్‌పి నేతలు జాతీయ కుట్రకు పాల్పడ్డారని, ఇది రథయాత్ర ద్వారా ప్రతిఫలించిందని, ఇది జాతీయ స్థాయి నేరమని సిబిఐ న్యాయవాది పిపిరావు పేర్కొన్నారు.

అద్వానీ, కల్యాణ్‌ సింగ్, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి తదితరులపై కుట్ర అభియోగాలు కొట్టేస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేసిన సందర్భంగా రావు చేసిన వ్యాఖ్యలపై బెంచ్ అభ్యంతరం తెలిపింది. జాతీయ ప్రాముఖ్యం కలిగిన కేసుగా భావిస్తూ.. కోర్టు రికార్డుల తర్జుమాకు మూడు నెలలు తీసుకుంటారా? అని అప్పీల్ విషయంలో సిబిఐ ఆలస్యంపై ప్రశ్నించింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

తొగాడియాపై కేసు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు విశ్వహిందూ పరిషత్(విహెచ్‌పి) నేత ప్రవీణ్ తొగాడియాపై కేసు నమోదైంది. ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ సభ్యుడు ఇమ్రాన్ అలీ ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనపై 295ఏ, 153ఏ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా తొగాడియాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ మహారాష్ట్ర సర్కారును కేంద్రం ఆదేశించింది.

చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్టు తేలితే ఆయనపై కేసు కూడా పెట్టాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రసంగ టేపులు, స్వర నమూనాలపై ఫోరెన్సిక్ ఆధారాలు లభిస్తే తొగాడియాపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు చెప్పారు. తొగాడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తేలితే చర్యలుంటాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తెలిపారు.

English summary
The Suprme Court on Thursday questioned the CBI for 
 
 its long delay over challnging the Allahabad High 
 
 Court verdict which held that senior BJP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X