హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సెంటిమెంట్ తెలుసు, సున్నితం: మనీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwary
హైదరాబాద్: తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, ఆలోచించి నిర్ణయం పరిష్కరిచాల్సి ఉంటుందని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను తాము అర్థం చేసుకున్నామని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని, అంతవరకు ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన అన్నారు.

పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు ఉరి వెనక రాకీయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రత కోసమే ఉరి తీసినట్లు ఆయన తెలిపారు. అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం ఆయన హైదరాబాదు వచ్చారు. పార్లమెంటుపై దాడి చేసినవారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ అఫ్జల్ గురు పిటిషన్ పెట్టుకోవడం వల్ల ఉరి తీయడంలో జాప్యం జరిగిందని ఆయన అన్నారు. పార్లమెంటుపై దాడికి దిగితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఆయన అన్నారు.

ఢిల్లీ పెద్దలకు మూటలే కనిపిస్తున్నాయి...

ఇదిలావుంటే, కాంగ్రెసు కండువాలు వేసుకోవడానికి సిగ్గుపడేలా ఉద్యమం చేయాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల్లో స్వార్థం పెరిగిందని, మానవత్వం నశించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓట్లు, సీట్ల లెక్కలే తప్ప సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యం లేదని ఆయన విమర్సించారు.

ఉద్యమాలు ఎలా చేయాలో చెప్తే అలా చేస్తామని, కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన తెలంగాణ యువతను కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఢిల్లీ కాంగ్రెసు నేతలకు వినిపించడం లేదని ఆయన కోదండరామ్ అన్నారు. సమిష్టి ప్రయోజనాల కోసం పోరాడాలని అంటుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

ఢిల్లీ కాంగ్రెసు నేతలకు ఆంధ్ర నాయకుల పైసల మూటల గలగలలే కనిపిస్తున్నా గానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష వినిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు కాగ్రెసు నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన అన్నారు. ఈ నెల 24వ తేదీ సడక్ బంద్ కార్యక్రమానికి జాతరలా కదిలి రావాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

రాయపాటిపై రాజయ్య ఫైర్..

తమ పార్టీ గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానేయాలని ఆయన సలహా ఇచ్చారు. తెలంగాణను అడ్డుకుంటే ప్రమోషన్ వస్తుందని రాయపాటి అనుకుంటున్నారని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామని నల్లగొండ జిల్లా భువనగిరి సభలో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

English summary
The union minister Manish Tiwary said that the Telangana issue is sensitive and needs time to take decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X