వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయం గుప్పిట్లో 40 నిమిషాలు: అప్పుడేమైంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: ఆనాడు భారత భద్రతా సిబ్బంది అప్రమత్తతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉండకపోతే భారీ నష్టమే జరిగి ఉండేది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం వాటిల్లి ఉండేది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పార్టమెంటుపై దాడికి ఉగ్రవాదులు తెగబడి భారతదేశాన్ని సవాల్ చేశారు. 2001 డిసెంబర్ 13వ తేదీన ఉగ్రవాదులు కారులో వేగంగా పార్లమెంటు ద్వారం గుండా దూసుకుని వెళ్తూ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మహిళా కానిస్టేబుల్ కమలేష్ మరణించింది.

పార్లమెంటు శీతాకాలం సమావేశాలు జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ రోజు పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడి చాలా సేపు కాలేదు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వెళ్లిపోయారు. అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్‌కె అద్వానీతో పాటు పలువురు ముఖ్య నేతలు పార్లమెంటు ఆవరణలోనే ఉన్నారు.

ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో భద్రతా సిబ్బంది ఏమరుపాటు ప్రదర్శించలేదు. దాదాపు 40 నిమిషాల పాటు పార్లమెంటు ఆవరణ కాల్పుల మోతలతో దద్దరిల్లింది. పార్లమెంటు ఆవరణ భయం గుప్పిట్లో చిక్కుకుపోయింది. ఉగ్రవాదుల కాల్పుల్లో 9 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు.

భద్రతా సిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టారు. ఉగ్రవాదుల చేతిలో మరణించినవారిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు ఒకరు ఆ తర్వాత మరణించారు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురును 2001 డిసెంబర్ 15వ తేదీన అరెస్టు చేశారు.

ఉగ్రవాదులకు తాను ఆయుధాలు సమకూర్చినట్లు, ఇతర సహాయం అందించినట్లు అఫ్జల్ గురు అంగీకరించాడు. ఈ దాడి వెనక జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా కుట్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

English summary
On December 13, 2001, five heavily-armed gunmen stormed the Parliament complex and opened indiscriminate fire, killing nine persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X