వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులరాజకీయమొద్దు, ఆవేదన పట్టదా?: గ్రీన్‌ఫీల్డ్ విక్టిమ్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: గ్రీన్ ఫీల్డ్ వ్యవహారాన్ని దళిత సమస్యగా చిత్రీకరించడం సరికాదని గ్రీన్ ఫీల్డ్ ప్లాట్ల సంఘం ఆదివారం కోరింది. భూకబ్జాతో మాజీ మంత్రి, కంటోన్మెంటు శంకర రావుకు సంబంధం లేదని ఆయన కుమార్తె సుష్మిత బుకాయిస్తున్నారని గ్రీన్ ఫీల్డ్స్ సంఘం తెలిపింది. దీనికి సంబందించి శంకర రావుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కూడా తీర్పు వచ్చిందని వారు అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో శంకర రావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.

ఆయనకు మద్దతిస్తున్న దళిత నాయకులు తమ గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఓ ఎమ్మెల్యే భూకబ్జాను పార్టీలు ప్రశ్నించవా అన్నారు. శంకర రావును వెంటనే అరెస్టు చేసి తమ భూములు తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. తాము గత ముప్పయ్యేళ్లుగా ప్లాట్ల కోసం పోరాడుతుంటే ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఫీల్డ్ వ్యవహారాన్ని కుల రాజకీయం చేయవద్దన్నారు.

గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. శంకర రావుకు దళితుల నేతలు మద్దతివ్వడం సరికాదన్నారు. శంకర రావుకు అనేక భూ ఆక్రమణలతో సంబంధముందని వారు ఆరోపించారు. ప్రభుత్వం అధికారులతో సర్వే చేయిస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే గ్రీన్ ఫీల్డ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

కాగా మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావు కూతురు సుష్మిత బుధవారం నేరెడ్‌మెట్ పోలీసులపై ముషీరాబాదు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేరెడ్‌మెట్ పోలీసులు తన తండ్రి శంకరరావును విచారణ కోసమంటూ తీసుకెళ్లే సమయంలో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముషీరాబాద్ పోలీసులు సుష్మిత ఫిర్యాదును స్వీకరించారు. తన తండ్రికి గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంతో సంబంధం లేదన్నారు.

English summary
Greenfield victims said that former Minister Shankar Rao's daughter told lie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X