వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓపికపట్టాలి: తెలంగాణపై మనీష్, టెర్రరిస్టుల్నివదిలేసింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
హైదరాబాద్: తెలంగాణ అంశం అత్యంత సున్నితమైనదని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారి ఆదివారం అన్నారు. తెలంగాణ అంశంపై ఎలాంటి నిర్ణీత గడువు లేదని అయితే, త్వరలో నిర్ణయాన్ని కేంద్రం ప్రకటిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ వంటి సున్నితమైన అంశంపై పరిష్కారం కోసం కేంద్రం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతోందన్నారు. ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికే వరకు ఓపిక పట్టాలని ఆయన సూచించారు. తెలంగాణపై కేంద్రం సీరియస్‌గా ఆలోచిస్తోందన్నారు.

రాష్ట్రంలో, కేంద్రంలో మళ్లీ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలకు ఎలాంటి అవకాశం లేదన్నారు. ముందస్తుకు సంకేతాలున్నాయన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. నిర్ణీత సమయంలోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిని చట్టానికి లోబడి తీసిందే అన్నారు. ఉగ్రవాదులను కాందహారులో వదిలేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది అన్నారు. కానీ, తాము ఉగ్రవాదులను వదిలి పెట్టడం లేదన్నారు.

ముందస్తుకు సంకేతాలు

దేశంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉన్నాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు హైదరాబాదులో అన్నారు. ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూపిఏ అసమర్థ విధానాల వల్ల ద్రవ్యలోటు శాతం పెరిగిందన్నారు. త్వరలో పార్లమెంటుకు ఎన్నికలు వస్తాయన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నా థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు.

ప్రజల ఒత్తిడితోనే పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయిన అప్జల్ గురును ఉరి తీశారన్నారు. అత్యున్నత న్యాయస్థానం విచారించి, దేశద్రోహికి సరైన శిక్ష విధించారన్నారు. పార్లమెంటు సిబ్బందిని హతమార్చినప్పుడు నోరెత్తని, పెదవి విప్పని కొందరు తీవ్రవాదిని ఉరి తీస్తే ప్రజా సంఘాల పేరుతో నిరసనలు తెలుపడం విడ్డూరమన్నారు.

నివేధికలు ఇవ్వలేదు

తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకత లేదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చానని అన్నారు.

English summary
The union minister Manish Tiwary said that the Telangana issue is sensitive and needs time to take decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X