వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొక్కిసలాట: మహా కుంభమేళా విషాద చిత్రాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

అలహాబాద్: మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు భక్తజనం పోటెత్తడంతో అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటనలో 36 మంది భక్తులు అసువులు బాశారు. పలువురు గాయపడ్డారు మృతుల్లో 16 మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. గాయపడినవారిని స్వరూప్ రాణి ఆస్పత్రిలోనూ రైల్వే ఆస్పత్రిలోనూ చేర్చారు.

అలహాబాద్ రైల్వే స్టేషన్ ఐదు, ఆరు ఫ్లాట్‌ఫారాల మధ్య ఉన్న వంతెనపై ఆదివారం రాత్రి ఆ విషాద సంఘటన జరిగింది. ఆ సమయంలో రైల్వే స్టేషన్‌లో లక్షలాది మంది ఉన్నారు. కుంభమేళాలో త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఇళ్లకు వెళ్లే ప్రయత్నంలో చాలా మంది భక్తులు ఉన్నారు.

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మౌని అమావాస్య రోజున పుణ్యస్నానాలు ఆచరిస్తే పవిత్రమనే ఉద్దేశంతో భక్తులు పెద్ద యెత్తున వచ్చారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేయడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. సకాలంలో ఆస్పత్రులకు తరలించకపోవడం వల్ల స్టేషన్‌లోనే ఐదారుగురు మరణించారని అంటున్నారు.

సంఘటన జరిగిన గంట పాటు దాదాపు పది శవాలు స్టేషన్‌లోనే పడి ఉన్నట్లు చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్య వల్ల పోలీసులు సకాలంలో స్టేషన్‌కు చేరుకోలేకపోయారని రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ అన్నారు. పోలీసులు లాఠీచార్జీ చేశారనే ఆరోపణను ఉన్నతాధికారులు ఖండిస్తున్నారు. సంఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారణకు ఆదేశించారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని రైల్వే శాఖను తాము ముందుగానే కోరినట్లు ఆయన తెలిపారు.

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన బంధువుల వద్ద దుఖ్కసాగరంలో మునిగిన భక్తులు.

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

తొక్కిసలాటలో కింద పడిన మహిళకు సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్న పోలీసు.

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

కుంభమేళా సందర్భంగా అలబాబాద్‌లో భక్తులు ఇలా కూడా...

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత తమ తమ ఇళ్లకు వెళ్లిపోవడానికి అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో భక్తుల సందడి..

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

తొక్కిసలాటలో మరణించిన తమ బంధువులను చూసి ఏడుపు గొంతుకలో కొట్లాడుతుంటే ఇలా..

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

అలాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళ చుట్టూ ఇలా..

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

తొక్కిసలాటలో మరణించిన తమ బంధువులను చూసి నివ్వెరపోతూ...

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

అలాహాబాద్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట సందర్భంగా సాయం కోసం కేకలు పెడుతూ...

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

తొక్కిసలాటలో గాయపడినవారిని కాపాడడానికి భక్తులు సహాయం చేస్తూ...

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

తమ ఆప్తులను కోల్పోవడంతో హృదయవిదారకంగా గుక్క పట్టి విలపిస్తూ భక్తులు ఇలా...

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

పోలీసులు, సాహాయక బృందాల సభ్యులు బాధిత దేహాన్ని తీసుకుని వెళ్తూ..

తొక్కిసలాట: కుంభమేళా విషాద చిత్రాలు

మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి వంతెనపై వేలాది మంది భక్తులు ఇలా...

ఆదివారంనాడు కుంభమేళాకు 3 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. అలహాబాద్ మీదుగా ప్రతి రోజూ 112 రైళ్లు వెళ్తుంటాయి. వాటికి తోడు అదనంగా 50 ప్రత్యేక రైళ్లను వేశారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. మృతులకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాపం ప్రకటించారు.

English summary
Thirty-six people were killed in a stampede at the Allahabad Railway Station on Sunday evening while several were critically injured. Sixteen of the dead were yet to be identified. The injured were admitted to the Swaroop Rani Hospital and Railway Hospital here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X