వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ బుక్‌పై అఫ్జల్ గురు ఆసక్తి, పాలే ఇష్టం

By Pratap
|
Google Oneindia TeluguNews

Afzal Guru
న్యూఢిల్లీ: ఉరిశిక్ష అనుభవించిన పార్లమెంటుపై దాడి కేసులో ప్రధాన దోషి అఫ్జల్ గురు బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ పుస్తకాన్ని ఆసక్తితో చదివాడట. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు 12 ఏళ్ల పాటు తీహార్ జైలులో ఉన్నాడు. జైలులో అతను ఎలా ఉండేవాడనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అఫ్జల్ గురు ఎక్కువగా పుస్తకాలు చదవడానికి ఇష్టపడేవాడట.

అద్వానీ మై కంట్రీ, మై లైఫ్ పేర రాసిన ఆత్మకథను చదవడానికి అతను విపరీతమైన ఆసక్తి చూపాడని అంటున్నారు. తనపై అద్వానీ ఏం రాశాడని తెలుసుకోవడానికి అతను ఆసక్తి ప్రదర్శించాడని చెబుతున్నారు. అప్పుడు పుస్తకాలు మాత్రమే అడిగేవాడని జైలు అధికారులు అంటున్నారు. అద్వానీ తన గురించి ఏం రాశాడని అఫ్జల్ గురు జైలు అధికారులను అడిగారని అంటున్నారు.

ఉర్దూ కవిత్వాన్ని చదవడాన్ని అతను ఎక్కువ ఇష్టపడేవాడని జైలు అధికారులు అంటున్నారు. అబుల్ కలామ్ ఆజాద్ రాసిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకం కోసం కూడా అఫ్జల్ గురు అడిగిటన్లు తెలిపారు. తన సెల్‌లో అఫ్జల్ గురుకు చెందిన రేడియో, మతం, తత్వశాస్త్రం, చరిత్ర, ఉర్దూ కవిత్వం పుస్తకాలు ఉన్నాయని జైలు అధికారులు చెప్పారు.

సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరడంతో పాటు అఫ్జల్ గురు వస్తువులను తమకు ఇవ్వాలని అడుగుతున్నట్లు అఫ్జల్ గురు కుటుంబం తరఫు న్యాయవాది ఒకరు చెప్పారు. అఫ్జల్ గురు అన్నం ఇష్టపడకపోయేవాడని, పాలను విపరీతంగా ఇష్టపడేవాడని జైలు అధికారులు చెప్పారు. ఎక్కువగా పాలు అడుగుతుండేవాడని చెప్పారు. అఫ్జల్ గురును ఈ నెల 9వ తేదీన ఉరి తీసిన విషయం తెలిసిందే.

English summary
As details regarding Afzal Guru's stay in Tihar jail are surfacing, it is learnt that he was an avid reader. According to authorities of Tihar jail, where Guru, the prime accused of Parliament attack was lodged for 12 years was keen on reading senior BJP leader LK Advani's autobiographical book "My Country, My Life".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X