వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొక్కిసలాట: విక్టిమ్స్ గోడు పట్టని అఖిలేష్, పెళ్లిలో బిజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Allahabad Stampede
అలహాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగిన సమయంలో ఓ పెళ్లిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను పరామర్శించి, వారి కోసం చేపట్టాల్సిన సహాయక చర్యలను పర్యవేక్షించడానికి బదులు ఆయన తన కజిన్ పెళ్లిలో గడపడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐదు, ఆరు ప్లాట్‌ఫారాల మధ్య ఉన్న కాలి వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆ సమయంలో రైల్వే స్షేషన్‌లో ఉన్నారు. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించి భక్తులు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఆ విషాద సంఘటన చోటు చేసుకుంది.

ప్రమాదం సంభవించిన కొన్ని గంటల తర్వాత కూడా యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాధితులను పరామర్సించడానికి రాలేదని, కజిన్ పెళ్లిలో ఉన్నారని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అఖిలేష్ యాదవ్‌తో పాటు కొంత మంది మంత్రులు కూడా ఆ పెళ్లిలో ఉన్నారు.

బాధితులకు సహాయం అందించే విషయంలో సమాజ్‌వాదీ, ప్రభుత్వ ప్రతిస్పందనలో జాప్యం ఎందుకు జరిగిందనేది ఎవరికీ తెలియదు. పైగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రైల్వే శాఖ పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. తమ వైపు నుంచి ఏ విధమైన పొరపాటు జరగలేదని, రైల్వే శాఖనే ప్రమాదానికి బాధ్యత వహించాలని యుపి ప్రభుత్వం అంటోంది. ప్రమాదానికి యుపి ప్రభుత్వ యంత్రాంగాన్ని రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ తప్పు పట్టారు.

English summary
It has been learnt that Uttar Pradesh Chief Minister Akhilesh Yadav was busy attending his cousin's wedding, instead of meeting the victims of Allahabad stampede. Around 36 people died in a stampede in Allahabad railway station on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X