వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్జల్ గురు చివరి లేఖ భార్యకే: ఏం రాశాడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Afzal Guru
న్యూఢిల్లీ: ఉరికంభం ఎక్కడానికి ముందు అఫ్జల్ గురు తన భార్య తబుసుమ్‌కు లేఖ రాశాడు. ఉర్దూలో ఆయన ఈ లేఖ రాశాడు. ఉరికంభానికి బయలుదేరే ముందు ఆ లేఖను జైలు సూపరింటిండెంట్ చేతిలో పెట్టి తన భార్యకు అందజేయాలని కోరాడు. ఈ లేఖను తన భార్యకు రాశానని, ఆమెకు అందేట్లుగా చూడాలని సెల్ నుంచి బయటకు వస్తూ అతను చెప్పాడని తీహార్ జైలు అధికారులు అంటున్నారు

అది అతని చివరి కోరిక అని, దాన్ని మరో మార్గం లేకపోవడంతో తాము స్పీడ్ పోస్టు ద్వారా పంపించామని, త్వరలోనే ఆమెకు ఆ లేఖ చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడు కలం, కాగితాలను దగ్గర పెట్టుకుని రాయడంలో అఫ్జల్ గురు జైలులో నిమగ్నమై ఉండేవాడని జైలు అధికారులు చెబుతున్నారు.

భార్యకు రాసిన లేఖలో తన కుటుంబ విషయాలను మాత్రమే అఫ్జల్ గురు ప్రస్తావించాడని జైలు అధికారులు చెప్పారు. అది పూర్తిగా వ్యక్తిగతమైన లేఖ అని, తన మరణానికి చింతించవద్దని, తమ కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని భార్యకు సూచించాడని వారు వివరించారు. కుమారుడి కోసం గుండెను దిటవు చేసుకుని, నిస్పృహకు గురి కావద్దని ఆయన సూచించాడు. అఫ్జల్ గురు రాసిన లేఖలో దేశవిషయాలేవీ లేవని అధికారులు అన్నారు.

కాశ్మీర్‌లోని సోపోర్‌లో గల అఫ్జల్ గురు కుటుంబానికి ఆ లేఖ ఇంకా అందాల్సే ఉంది. ఉరికంభానికి ఎక్కే ముందు రోజు గురించి అఫ్జల్ గురుకు సంబంధించి అన్నీ ఊహాగానాలే ప్రచారంలోకి వచ్చాయని, ఉరి కంభం ఎక్కడానికి ముందు నిద్రలేని రాత్రి గడిపాడనేది నిజం కానది, జైలులో చాలా ఆదర్శంగా వ్యవహరించాడని, చివరి వరకు కూడా ఏ విధమైన సమస్యనూ సృష్టించలేదని జైలు అధికారులు అన్నారు.

English summary
The morning that Afzal Guru was to be executed, he wrote a letter to his wife, Tabassum. Written in Urdu, he handed it over to jail officials before he was marched out for his execution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X