వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్జల్ గురు ఉరి: అత్యంత గోప్యంగా ఆపరేషన్ త్రీ స్టార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Afzal Guru
న్యూఢిల్లీ: 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో దోషి అఫ్జల్ గురు ఉరిశిక్షను రహస్యంగా అమలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను న్యూఢిల్లీలోని తీహార్ జైలులో శనివారం ఉదయం ఉరి తీశారు. ఈ రహస్య ఉరితీత ప్రక్రియకు ఆపరేషన్ త్రీ స్టార్ అని పేరు పెట్టారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన తర్వాత రోజు ఫిబ్రవరి 4వ తేది నుండి ఈ ఆపరేషన్ ప్రారంభమైంది.

హోంమంత్రిత్వ శాఖ, తీహార్ జైలుకు చెందిన కొంతమంది ఉన్నతాధికారులకు మాత్రమే ఈ ఆపరేషన్ గురించి తెలుసు. ఆపరేషన్‌కు సంబంధించి ప్రతి విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో అఫ్జల్ గురు ఉరి విషయం బయటకు పొక్కలేదు. ఆపరేషన్‌లో పాల్గొన్న వారంతా పూర్తి రహస్యాన్ని పాటించారు. మంగళవారం ప్రారంభమైన ఆపరేషన్ శనివారం ఉరితీతతో ముగిసింది. ఆపరేషన్ పూర్తిగా విజయవంతమయ్యాకే విషయం బయటకు తెలిసింది.

కాగా అంతకుముందు ముంబై మారణ హోమం నిందితుడు అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలకు 'ఆపరేషన్‌కు ఎక్స్' అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. కసబ్‌ను 21 నవంబర్ 2012 ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో అత్యంత గోప్యంగా పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు. దీని అమలుకు ఆపరేషన్ ఎక్స్ అనే పేరును పెట్టారు. ఆపరేషన్ ఎక్స్ ప్రత్యేక లా అండ్ ఆర్డర్ ఐజి దేవన్ భారతి నేతృత్వంలో గప్‌చుప్‌గా సాగిపోయింది.

ఉదయం ఏడున్నరకు అజ్మల్ కసబ్‌ను ఉరి తీశారనే వార్త కేవలం భారత్ దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. దేవన్ భారతి నేతృత్వంలో ఆపరేషన్ ఎక్స్ నవంబర్ 5వ తారీఖు నుండి ప్రారంభమైంది. కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అదే రోజు తిరస్కరించారు. ఆ తర్వాత నుండి దేవన్ జట్టు తమ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా ప్రారంభించింది.

ఈ ఆపరేషన్‌లో దేవన్ భారతితో సహా పదిహేడు మంది సీనియర్ అధికారులు ఉన్నారు. సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులందరి ఫోన్‌లు ఆపరేషన్ ప్రారంభం అయినప్పటి నుండి స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. కేవలం దేవన్ భారతి ఫోన్ మాత్రమే పని చేసినట్లుగా సమాచారం. కసబ్‌ను ముంబై జైలు నుండి పూణే ఎరవాడ జైలుకు తరలించే బాధ్యతను దేవన్ భారతి అండ్ కో సమర్థవంతంగా పూర్తి చేసింది. ఆపరేషన్ ఎక్స్ పూర్తయ్యే వరకు ఎవరికీ ఎలాంటి సమాచారం అందలేదు. ఈ రోజు ఉదయం కసబ్‌ను ఉరి తీసిన తర్వాత దేవన్ భారతి ''ఆపరేషన్ ఎక్స్ విజయవంతంగా పూర్తయింద''ని సందేశమిచ్చారు. ఆ తర్వాత అది వెలుగులోకి వచ్చింది.

English summary
'Operation Three Star' was the code name of the entire top secret plan in which Jaish-e-Mohammad terrorist Afzal Guru was hanged in the high-security Tihar Jail on Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X