హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆగడాలంటూ హెచ్చార్సీకి: లవర్స్‌కి పెళ్లేనని బజరంగ్‌దళ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

VHP
హైదరాబాద్: రిసార్టులు, ఫాంహౌస్‌లు, హోటళ్లు, క్లబ్బులు ప్రేమికుల దినోత్సవ వేడుకలను రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్‌లు బుధవారం విజ్ఞప్తి చేశాయి. ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే) మన సంస్కృతి కాదని వారు అన్నారు. దీనిని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 14వ తేదిన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎవరైనా ప్రేమికులు రహదారుల పైన కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని వారు హెచ్చరించారు.

ప్రేమికుల దినోత్సవం మన సంస్కృతి కాదని విదేశీ సంస్కృతి అన్నారు. బహుళజాతి సంస్థలు తన వ్యాపారాన్ని పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా పరాయి సంస్కృతిని తీసుకొచ్చి మన నెత్తిన రుద్దుతున్నాయని వారు అన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు. రిసార్టులు, ఫాం హౌస్‌లు, క్లబ్బులు, హోటళ్లు ఈ వేడుకలను రద్దు చేసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఆగడాలు అరికట్టండి

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్‌ల ఆగడాలు అరికట్టాలని అచ్యుత రావు అనే న్యాయవాది మానవ హక్కుల సంఘాన్ని(హెచ్చార్సీ)ని ఆశ్రయించారు. ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేమ జంటలకు రక్షణ కల్పించాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించేలా చూడాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

కాగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ ప్రేమికుల రోజు నాడు భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలంటూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు బయట ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తుంటారు. ప్రతి ఏడాది విహెచ్‌పి, దళ్ కార్యకర్తలు సంస్కృతిని కాపాడుకోవాలంటూ విజ్ఞప్తి చేయడం, వినని వారికి బలవంతంగా పెళ్లిళ్లు చేయడం జరుగుతోంది.

English summary
The members of Vishwa Hindu Parishad (VHP) and Bajrang Dal on Wednesday February 13 warned against the celebration of Valentine's Day and called for the closure of pubs in the city on February 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X