హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజినీరింగ్ విద్యార్థిని కృష్ణవేణి హత్య: భర్తే దోషి, యావజ్జీవం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Krishnaveni
విశాఖపట్నం: ఇంజినీరింగ్ విద్యార్థిని కృష్ణవేణి హత్య కేసులో భర్త రవికుమార్ ముద్దాయి అని విశాఖ మహిళా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. హత్య కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇతర కుటుంబ సభ్యులకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. అందరూ ఒక్కొక్కరు మరో ఐదువేల రూపాయల జరిమానా చెల్లించారని తీర్పు చెప్పారు. ఈ డబ్బు చెల్లించని పక్షంలో వారికి మరో ఏడాది అదనంగా కారాగార శిక్ష విధించారు.

2011 మార్చి 4వ తేదిన కృష్ణవేణి హత్య జరిగింది. దీనిపై మహిళా కోర్టుకు వెళ్లారు. దీనిపై భర్త రవి కుమార్ హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే, ఆ కోర్టులు కేసుకు నిరాకరించాయి. దీంతో శ్రీలక్ష్మి హత్య కేసు విచారణ ప్రారంభమైంది. కృష్ణవేణి నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఇంజినీరింగు కళాశాల నుండి తిరిగి వస్తున్న సమయంలో భర్త కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికి చంపారు.

ఆస్తి కోసమే చంపేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్త్లెన 6 నెలలకే ఈ దారుణం చోటు చేసుకుంది. తమ కూతురు విషయంలో తమకు న్యాయం జరగలేదని మృతురాలి తల్లి ఏడుస్తూ చెబుతున్నారు. నిందితుడికి ఉరిశిక్షే సరైనదని ఆమె అన్నారు. వీరి తరఫు న్యాయవాది కూడా నిందితుడుకి ఉరి శిక్షే సరైన శిక్ష అన్నారు. ఈ తీర్పు తమకు సంతృప్తిని కలిగించలేదన్నారు.

సంవత్సరంన్నర క్రితం ఇంజినీరింగ్‌ చదువుతున్న కృష్ణవేణి విశాఖపట్నంలో నడి రోడ్డుపైనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నగరంలోని పిఠాపురం కాలనీలో కళాభారతి వద్ద రహదారిపై వెళ్తున్న దువ్వి కృష్ణవేణి (19)ని వెనక నుంచి నరికి హత్య చేశాడు. విశాఖపట్నం శివాజీపాలేనికి చెందిన దువ్వి సత్యనారాయణ, వేణు దంపతుల ఇద్దరు కుమార్తెల్లో కృష్ణవేణి ఒకరు.

English summary
Engineering student Krishnaveni murdered in Vishakapatnam yesterday. It is alleged that Her husband Ravikumar hacked to death her. It created chaos in Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X