వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బార్ గర్ల్స్ డ్యాన్స్‌లతో కేంద్ర మంత్రి జన్మదిన వేడుక

By Pratap
|
Google Oneindia TeluguNews

బారాబంకి: మహా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 36 మంది భక్తులు దుర్మరణం పాలై దేశం విషాదంలో మునిగిపోయిన పరిస్థితిలో కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత బేణీ ప్రసాద్ వర్మ తన 73వ జన్మదిన వేడుకను ఉల్లాసంగా జరుపుకున్నారు. బార్ గర్ల్స్ డ్యాన్స్‌లతో ఆయన తన జన్మదిన వేడుకలకు అందాలను అద్దారు.

బార్ గర్ల్స్ దాదాపు రెండు గంటల పాటు హిందీ పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా బేణీ ప్రసాద్ వర్మ 30 నిరుపేద బాలికలకు రామ్ వాటికలో వివాహం జరిపించారు. గత పదేళ్లుగా ఆయన పేద జంటలకు తన జన్మదినం సందర్భంగా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు.

గత పదేళ్ల వేడుకల్లో బార్ గర్ల్స్ డ్యాన్స్‌లు ఆయన జన్మదిన వేడుకల్లో చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. దీనిపై మాట్లాడేందుకు బేణీ ప్రసాద్ వర్మ అందుబాటులో లేరు. నూతన దంపతులు బార్ గర్ల్స్‌ను పిలిపించుకున్నారని కార్యక్రమ నిర్వాహకుడు వీరేంద్ర సింగ్ చెప్పారు. అప్పటికే మంత్రి వెళ్లిపోయారని ఆయన చెప్పారు.

Beni Prasad Varma

ఇదిలావుంటే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సమీప బంధువు అన్షూల్ యాదవ్ చాలా సాధారణంగా జరిగింది. తొక్కిసలాట బాధితులను గౌరవించడానికి ఆర్భాటాలు లేకుండా ఈ వివాహం జరిపించారు కొత మంది షెహనాయ్ కళాకారులను మాత్రం పిలిపించారు. అదిరిపోయే సంగీతం, బాణా సంచా పేలుళ్ల వంటి ఆర్భాటాలు లేకుండా ఈ వివాహం జరిగింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు.

English summary
While the entire nation was in shock after the death of 36 pilgrims in a stampede at the Allahabad, the Congressmen in Barabanki were celebrating Union steel minister Beni Prasad Varma’s 73rd birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X