వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా టెక్కీపై దాడి: కేకలేయగా రక్షించిన స్థానికులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bangalore
బెంగళూరు/హైదరాబాద్: కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్‌ను దుండగుల బారిన పడకుండా స్థానికులు రక్షించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని వైట్ ఫీల్డులో నీలిమ అనే సాఫ్టువేర్ ఇంజనీర్ నివసిస్తున్నారు. ఆమె రాత్రి సమయంలో ఒంటరిగా ఎటిఎం సెంటర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆమెను కొందరు దుండగులు వెంబడించారు. ఆమె తన ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో వారు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు.

దుండగులు అనుకోకుండా ఒక్కసారిగా తనపై దాడి చేయడంతో నీలిమ అప్రమత్తమైంది. వెంటనే గట్టిగా కేకలు వేసింది. నీలిమ ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే మేలుకొని సంఘటనా స్థలానికి వచ్చారు. జరిగిన విషయాన్ని గుర్తించి వచ్చిన దుండగులకు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. అప్రమత్తంగా ఉండి కేకలు వేయడం, ఇరుగుపరుగు వారు తక్షణమే స్పందించడంతో నీలిమ దొంగల బారి నుండి బయటపడింది.

హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం

తమ కుమారుడి ఆచూకి కనిపెట్టమని ఓ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గుడిమెట్ల గ్రామానికి చెందిన ప్రభాకర్‌ను గత నెల 26న గిద్దలూరు పోలీసులు ఓ దొంగతనం కేసులో విచారణ నిమిత్తం స్టేషనుకు పిలిచారు. ఆ రోజు నుండి తన కొడుకు కనిపించకుండా పోయాడని బంధువులు, పరిచయస్తులను అడిగనా జాడ దొరకలేదని కోర్టుకు తెలిపారు.

పోలీసులే తమ కుమారుడి అదృశ్యానికి కారణమని వారు చెప్పారు. తమ కొడుకును తీసుకు రాకుంటే ఆత్మహత్యకు పాల్పడుతామని వారు హెచ్చరించారు. దీంతో ముందు జాగ్రత్తగా చార్మినార్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ చేశారు.

English summary
Local people in Bangalore were saved a woman software engineer from thieves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X