ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపరాధచిచ్చు: 5000 ట్రిపుల్ ఐటి విద్యార్థుల సస్పెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Adilabad
అదిలాబాద్: జిల్లాలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటిలో అపరాధ రుసుం చిచ్చు ఆందోళన బుధవారం ఐదువేల మంది విద్యార్థుల సస్పెన్షన్‌కు దారి తీసింది! సంక్రాంతి సెలవులకు వెళ్లిన విద్యార్థులు కళాశాలకు ఆలస్యంగా వచ్చారని యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుండి వంద రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులు మొదట డబ్బులు చెల్లించినా ఆ తర్వాత చెల్లించిన జరిమానా డబ్బులు తిరిగివ్వాలని కోరుతూ మంగళవారం రాత్రి కళాశాల కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

అపరాధ రుసుం పేరిట వేధిస్తున్నారని వారు ఆరోపించారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు అధికారుల కార్యాలయాల ఎదుట బైఠాయించారు. దీంతో ప్రవర్తన సరిగా లేదంటూ ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరానికి చెందిన ఐదువేల మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉదయం ప్రకటించారు.

విద్యార్థులు బుధవారం సాయంత్రానికల్లా కళాశాల వదిలి వెళ్లాలని ఆదేశించారు. దీన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థులు కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో సుమారు 200 మంది విద్యార్థులు ఇళ్లకు పయనమయ్యారు. ఈ ఘటనపై నిర్మల్ ఆర్డీవో భుజన్న బుధవారం సాయంత్రం కళాశాలను సందర్శించి విద్యార్థులు, అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ వైస్ చాన్స్‌లర్ రాజ్ కుమార్ పరిస్థితి చక్కబెట్టేందుకు బాసర ట్రిపుల్ ఐటీకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న ముథోల్ సిఐ శ్రీనివాస్ ట్రిపుల్ ఐటి ప్రాంగణానికి చేరుకొని విద్యార్థులను శాంతింపచేశారు. కాగా పరిస్థితి సద్దుమణగడంతో యాజమాన్యం కూడా సస్పెన్షన్ అంశాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం.

English summary
About five thousand IIIT students are suspended by the college management in Basara on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X