దీంతో ఆమె మృతి చెందింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిస్టోరియస్కు రెండు కాళ్లు లేవు. అతడు లండన్ ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించాడు. ఇతనిని సాధారణంగా అందరూ బ్లేడ్ రన్నర్ అని పిలుస్తారు. అతను ప్రిటోరియాలో ఉంటున్నాడు.
పోలీసులు పిస్టోరియస్ పేరును వెల్లడించేందుకు నిరాకరించారు. అయితే, తాము సంఘటన స్థలంలో పిస్టల్ చూశామని, 26 ఏళ్ల వ్యక్తిని కస్టడీకి తీసుకున్నామని మాత్రం పోలీసులు చెబుతున్నారు. అంతకుకుమించి వివరాలు ఇచ్చేందుకు పోలీసులు అధికారులు నిరాకరిస్తున్నారు.
కాగా స్థానికంగా మరియు మీడియాలో మాత్రం పోలీసులు అదుపులోకి తీసున్నది పిస్టోరియస్నేనని చెబుతున్నారు. అతను తన గర్ల్ ఫ్రెండ్ను హత్య చేసినందుకు అరెస్టయ్యారని చెబుతున్నారు. ఆమెను దొంగగా భావించి పిస్టోరియస్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నారు.