వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు హరికృష్ణ ఫోన్: ఏకాంతంగా తండ్రితో నారాలోకేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్/గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. గుంటూరు జిల్లాలోని కొలకనూరు వద్ద వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న సమయంలో చంద్రబాబు వేదిక పైనుండి పడిన విషయం తెలిసిందే. దీంతో హరికృష్ణ ఆయనకు ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని బాబుకు సూచించారు.

మరోవైపు విషయం తెలుసుకున్న చంద్రబాబు భార్య భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, అల్లుడు జూనియర్ ఎన్టీఆర్, బావమరిది నందమూరి బాలకృష్ణ తదితర కుటుంబ సభ్యులు బాబుకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు. విషయం తెలుసుకున్న నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాదు నుండి గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. గురువారం రాత్రి ఘటన జరిగిన కొలకనూరుకు చేరుకున్నారు.

నారా లోకేష్ స్థానిక నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబును కలిశారు. ఆయనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. కాలి నొప్పిపై ఆరాతీశారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పాదయాత్రపై ఆయన సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం వైద్యులతో చర్చించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

కాగా చంద్రబాబు గురువారం తూలిపడ్డ విషయం తెలిసిందే. కొలకలూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన మెట్ల నుండి కిందకు దిగే ప్రయత్నాలు చేశారు. ఆయన దిగుతున్న సమయంలో వేదిక కోసం ఏర్పాటు చేసిన మెట్లు కూలిపోయాయి. బాబు తూలిపడబోయారు. అయితే, గన్‌మెన్‌లు సమయస్ఫూర్తితో వ్యవహరించి బాబుకు చిన్న గాయం కాకుండా రక్షించారు. వేదిక కూలగానే బాబు తూలి కిందకు పడబోతుండగా వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్‌లు ఆయనను అమాంతం చేతులపై ఎత్తుకున్నారు. దీంతో బాబుకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు. కాలికి మాత్రం స్వల్పంగా గాయమైంది. మాజీ మంత్రి అలపాటి రాజాకు గాయాలయ్యాయి.

English summary
Telugudesam Party MP Harikrishna called up chief Nara 
 
 Chandrababu Naidu, wishes him speedy recovery after 
 
 state collapse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X