ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెత్తకుప్పలో రెండు తుపాకులు, 20 బుల్లెట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guns found in dustbin
హైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో చెత్తకుప్పలో తుపాకులు దొరకడం కలకలం రేపింది. సికింద్రాబాద్ మహాత్మా గాంధీ ఆసుపత్రి వద్ద వెనుక ఉన్న పద్మారావునగర్‌లోని ఓ చెత్తకుప్పలో శుక్రవారం రెండు తుపాకీలు కనిపించాయి. వాటిని చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చెత్తకుండీని శుభ్రం చేస్తుండగా తుపాకులతో పాటు బుల్లెట్లు కనిపించాయి.

మున్సిపాల్ సిబ్బంది ఫిర్యాదు మేరుకు పోలీసులు అక్కకడకు చేరుకుని తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు 303 తుపాకులు, ఇరవై బుల్లెట్లను పోలీసులు అక్కడ గుర్తించారు. ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకు వచ్చారనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.

హోటల్లో అగ్ని ప్రమాదం

నాంపల్లిలోని హోటల్ కామత్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

పైకప్పు కూలి ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో గల పివికె భూగర్భ గనిలో శుక్రవారం ఉదయం బొగ్గు ఉత్పత్తి పనుల నిర్వహిస్తుండగా గని పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వెంటనే సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

English summary
Two 303 guns and twenty bullets have been found in a dustbin in Padmarao Nagar, behind MGM Hospital, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X