హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఖ నేనే రాశా, వేధించారే కానీ: పెదవివిప్పిన టీచర్ లీల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఎస్సై వేధింపుల కేసుపై టీచర్ లీల శుక్రవారం పెదవి విప్పారు. దుండిగల్ ఎస్సై సుధీర్ వేధింపుల కారణంగా లీల ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యం కావడం, ఎస్సైని సస్పెండ్ చేయడం, లీల, కుటుంబ సభ్యులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిచడం తెలిసిందే. అయితే, ఈ అంశంపై లీల ఈ రోజు స్పందించారు. లీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మొదట ఆమెను మియాపూర్ కోర్టుకు తీసుకు వెళ్లారు.

అక్కడ న్యాయమూర్తి లేకపోవడంతో ఆమెను రాజేంద్రనగర్ కోర్టుకు తీసుకు వెళ్లారు. రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లీల వాంగ్మూలం నమోదుకు కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ సందర్భంగా లీల మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య లేఖను తానే రాశానని ఆమె చెప్పారు. ఆయన తనను వేధించిన మాట వాస్తవమేనని, దీనిపై కేసు కూడా పెట్టామని చెప్పారు. తన అదృశ్యానికి మాత్రం ఎస్సై కారణం కాదన్నారు.

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు. ఇబ్బందుల కారణంగా యూసఫ్‌గూడలోని ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లానని చెప్పారు. ఎస్సై వేధించిన సందర్భాలు ఉన్నాయని, ఆయనను సస్పెండ్ చేయడం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. ఎస్సై గతంలో తనను మానసికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు లీల సోదరుడితో పాటు మరొకరిని విచారించారు. తమను విచారణ కోసమే పిలిచారని లీల సోదరుడు చందు చెప్పారు.

ఫోన్ సంభాషణలు గుర్తించాం: డిసిపి

లీల, సుధీర్ ఫోన్ సంభాషణలు, సంక్షిప్త సందేశాలను తాము గుర్తించామని మాదాపూర్ డిసిపి యోగానంద్ అన్నారు. సాఫ్టువేర్ ఉద్యోగిని నీలిమ కేసులోను మీడియా పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తం చేసిందని కానీ, మహిళల డిగ్నిటీ దృష్ట్యా కొన్ని విషయాలు బయటపెట్టలేమని ఆయన అన్నారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తప్పు ఎవరిదైతే వారిపై చర్య తీసుకుంటామన్నారు. ఎస్సై సిక్ లీవ్‌లో ఉన్నారన్నారు.

English summary

 Teacher Leela opens mouth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X