వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక తల్లి ఆత్మహత్య, వేధింపులే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geetika Sharma
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ తల్లి అనురాధ శర్మ ఢిల్లీలోని తన నివాసంలో సీలింగ్ ఫాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు గీతిక ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. వాయువ్య ఢిల్లీలోని ఆశోక్ విహార్‌లోని తన నివాసంలో అనురాధ శర్మ శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

కుమార్తె మరణంతో ఆమె కుంగిపోయిందని చెప్పారు. అనురాధ శర్మ ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. గీతిక శర్మ ఆత్మహత్య తర్వాత అనురాధ శర్మ కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇందులో మరో ట్విస్ట్ ఏమంటే గీతిక ఆత్మహత్య కేసును వెనక్కి తీసుకోవాలనే కందా ఒత్తిడి కారణంగానే అనురాధ కూడా ఆత్మహత్య చేసుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరు నెలల్లో కందా మనుషులు పలుమార్లు కేసు వెనక్కి తీసుకోవాలని వేధించినట్లు ఆరోపిస్తున్నారు.

కాగా ఎమ్‌డిఎల్ఆర్ గ్రూప్‌కు చెందిన విమానయాన సంస్థలో ఎయిర్‌ హోస్టెస్‌గా పని చేసిన గీతిక ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ సంస్థ అధిపతి, హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా ఆత్మహత్యకు కారణమని లేఖ రాసింది.

ఈ కేసులో అరెస్టయిన గోపాల్ కందా ప్రస్తుతం జైలులో ఉన్నారు. గీతిక కేసులో ఆరోపణలు రావడంతో ఆయన తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. మరోవైపు గీతిక ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతోంది. గీతిక, గోపాల్ కందా కుటుంబ సభ్యులు కలిసి తీర్థయాత్రలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది.

English summary
Exactly six months and 10 days after air-hostess 
 
 Geetika Sharma committed suicide by hanging at her 
 
 north Delhi residence, her 51-year-old mother, 
 
 Anuradha Sharma also allegedly hanged herself, using 
 
 a chunni in the same room of their Ashok Vihar flat 
 
 on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X