వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో ఉల్క బీభత్సం: గంటకు 54వేల కి.మీ.ల వేగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Meteorite hits central Russia
మాస్కో: రష్యాలో ఉల్కపాతం బీభత్సం సృష్టించింది. దాదాపు పది టన్నుల బరువు ఉన్న ఓ ఉల్క భూమికి కొన్ని కిలోమీటర్ల పైన పేలిపోయి ఓ పట్టణంపై శకలాలుగా పడింది. ఈ ఘటనలో దాదాపు పదకొండు వందల మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ రష్యాలోని చెల్యాబిన్‌స్క్ పట్టణంలో ఉల్కపాతం పడింది. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఈ భారీ ఉల్క ఒక్కసారిగా పేలిపోయింది. భూవాతావరణంలోకి వచ్చేటప్పుడు ఉల్క వేగం గంటకు 54వేల కిలోమీటర్లుగా ఉంది.

ఈ ప్రభావంతో ముక్కలైన శిలలు ఇక్కడి ఈ నగరంపై పడింది. అత్యంత వేగంతో భూమిని తాకడం వల్ల ఏర్పడిన ప్రకంపనలతో దాదాపు మూడు వేల భవనాలు, అనేక కార్లు దెబ్బతిన్నాయి. గాయపడ్డ వారిలో దాదాపు రెండు వందల మంది వరకు ఆసుపత్రుల్లో చేరారు. క్షతగాత్రుల్లో రెండు వందల మంది చిన్నారులున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే సైన్యం రంగంలోకి దిగింది. దాదాపు 20వేల మందితో కూడిన సహాయక బృందాలు నగరానికి చేరుకున్నాయి.

ముందు జాగ్రత్తగా నగరంలో గ్యాస్ సరఫరాను నిలిపేశాయి. బాధితులకు సాయం చేస్తూనే మరోపక్క గ్రహశకలాలు భూమిని తాకిన మూడు ప్రదేశాలను గుర్తించాయి. రెండు శిలలు ఇక్కడి చెబార్కుల్ చెరువు సమీపంలో పడిన ఆనవాళ్లు కనిపించాయి. ఇతర ప్రాంతాలను పరిశీలించడానికి మూడు యుద్ధ విమానాలనూ రంగంలోకి దించారు. ఉల్కాపాతం వల్ల రేడియేషన్ ప్రభావం, రసాయనిక చర్యల ముప్పును పరిశీలించడానికి ప్రత్యేక రక్షణ బృందాలను ఇక్కడకి తరలించారు.

జనావాసాలపై భారీ శిలలు పడనందుకు దేవుడికి కృతజ్ఞతలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. నగరంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఉల్కాపాతానికి సంబంధించిన వీడియోలను స్థానికులు కొందరు ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ వినాశనం జరుగనుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం భూమికి అతి సమీపంలోకి వచ్చిన '2012డీఏ14' గ్రహ శకలానికి, ఈ ఉల్కాపాతానికి ఎలాంటి సంబంధం లేదని నాసా శాస్త్రేవేత్తలు స్పష్టం చేశారు.

English summary
About 200 people were injured when a meteorite shot across the sky in central Russia on Friday sending fireballs crashing to Earth, smashing windows and setting off car alarms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X