వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యే అడ్డుకున్నారు: తెలంగాణపై సర్వే సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sarve Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యే అప్పట్లో అడ్డుకున్నారని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ శనివారం అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు ఇచ్చిన తెలంగాణ కానుకను గూడుపుఠానీ చేసి రోశయ్య అడ్డుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చెబితే కాంగ్రెసు ఎంపీలు రాజీనామా చేసేది లేదన్నారు.

తెలంగాణను కేంద్రం ప్రకటించి, నాడు ముఖ్యమంత్రిగా రోశయ్యని ఢిల్లీకి పిలిచారని, రాష్ట్రానికి వెళ్లి అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయించమని ఆయనను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించిందని, అందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. ఢిల్లీలో సరేనని ఇక్కడకు వచ్చి సీమాంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని చెప్పి 2009 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చామని, తెలంగాణ ఇచ్చాకే 2014 సాధారణ ఎన్నికలకు వెళుతామని స్పష్టం చేశారు.

మోసం చేసిన కాంగ్రెసు

విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి తెలంగాణపై కాంగ్రెసు చేసిన మోసంపై వివరించాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. శనివారం ఖమ్మంలో జరిగిన ఖమ్మం విద్యార్థి గర్జనలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ వారే ప్రథమ శత్రువులన్నారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు.

24న సడక్‌బంద్‌కు పిలుపునిచ్చామని అందులో అందరూ పాల్గొనాలన్నారు. తెలంగాణపై కేంద్రం నాలుగు సార్లు మాట ఇచ్చి తప్పిందన్నారు. అఖిలపక్షంలో సిపిఎం తప్ప మిగతా అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూల ప్రకటనలు చేసినా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.

English summary
Sarve slams Rosaish for Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X