వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గీతిక తల్లి అనురాధ ఆత్మహత్య: కందా, అరుణపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Charges against Kanda and Aruna
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక తల్లి అనురాధ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా, ఆయన సహాయకురాలు అరుణ చద్దాలపై ఢిల్లీ పోలీసులు శనివారం కేసును నమోదు చేశారు. అరుణ మృతికి వారే కారకులనే ఆరోపణలతో కేసు నమోదయింది. శుక్రవారం గీతిక తల్లి అనురాధ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటన స్థలంలో మొదట ఎలాంటి సూసైడ్ లేఖలు దొరకలేదని వార్తలు వచ్చినప్పటికీ పోలీసులకు ఓ లేఖ దొరికింది.

తన ఆత్మహత్యకు గోపాల్ కందా, అరుణలే కారణమని ఆమె లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా కందా, అరుణలపై మరో కేసు నమోదు చేశారు. బంధువులు కూడా వారి పైనే ఆరోపణలు గుప్పించారు.

కాగా మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ తల్లి అనురాధ శర్మ ఢిల్లీలోని తన నివాసంలో సీలింగ్ ఫాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. కూతురు గీతిక ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌లో ఉన్నారు. వాయువ్య ఢిల్లీలోని ఆశోక్ విహార్‌లోని తన నివాసంలో అనురాధ శర్మ శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుమార్తె మరణంతో ఆమె కుంగిపోయిందని చెప్పారు. అయితే, ఆత్మహత్యకు కారణం మాత్రం గోపాల్ కందా అని బంధువులు ఆరోపించారు.

గీతిక శర్మ ఆత్మహత్య తర్వాత అనురాధ శర్మ కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. గీతిక ఆత్మహత్య కేసును వెనక్కి తీసుకోవాలనే కందా ఒత్తిడి కారణంగానే అనురాధ కూడా ఆత్మహత్య చేసుకున్నదని గీతిక తండ్రి కూడా ఆరోపించారు.

English summary

 A day after Geetika Sharma's mother committed suicide, Delhi police on Saturday slapped charges of abetment of suicide against former Haryana minister Gopal Kanda and his aide Aruna Chaddha after their names figured in her suicide note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X