వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలుకెళ్లి మారుతున్నారు: షర్మిల యాత్రపై బొత్స ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నవారిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికో, కాంగ్రెసు పార్టీ కార్యాలయానికో వెళ్తారని, వైయస్సార్ కాంగ్రెసులో చేరాలని అనుకుంటున్నవారు జైలుకెళ్లి వెనక్కి వచ్చి పార్టీ మారుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్రలో షర్మిల తమ పార్టీపై, ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సోమవారం తీవ్రంగా మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్రపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు, షర్మిల పాదయాత్రల్లో చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు అమాయకులు కారని ఆయన అన్నారు. అధికారం ముఖ్యం కాదు, పరిస్థితులను మార్చేస్తానని చంద్రబాబు అంటున్నారని, వ్యవసాయం దండుగ అన్న వ్యక్తి తగుదునమ్మా అంటూ వస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వెనక్కి తిరిగి చూసుకోవాలని, తన ప్రభుత్వ హయాంలో ఏం చేశారో చూసుకోవాలని ఆయన అన్నారు.

ఎన్నికలకు తమ పార్టీ భయపడడం లేదని ఆయన అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతోనే తమను సహకార ఎన్నికల్లో తమను గెలిపించారని ఆయన అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల విషయంలో తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

బలహీనవర్గాలకు తగిన ప్రయోజనం, ప్రాతినిధ్యం కల్పించడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని బొత్స చెప్పారు. రాష్ట్ర ప్రజలు తమపై నమ్మకం ఉంచారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం 28వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఆ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన అన్నారు. ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రతిపక్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, జైలుకెళ్లి కొంత మంది పార్టీలు మారుతున్నారని, రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు ఏం చేశాయని సహకార ఎన్నికల్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు గెలుస్తాయని ఆయన అడిగారు.

English summary
PCC president Botsa Satyanarayana has fired at YSR Congress party president YS Jagan abd Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X