హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకూ పుణ్యమివ్వండి: టిఎస్సార్, ఆలోచిస్తా: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-T subbirami Reddy
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చిరంజీవి రక్త నిధి తరహా విశాఖపట్నంలోను ఓ రక్త నిధిని ఏర్పాటు చేయాలని ఎంపి టి.సుబ్బిరామి రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని కోరారు. దానికి చిరు.. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అని, మీరు సహకరిస్తానంటే ఆలోచించి చెబుతానన్నారు. ఆదివారం కాంగ్రెసు నేత టిడి నాయక్ ఆధ్వర్యంలో చిరంజీవి రక్త నిధికి ఆయన అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడారు.

మన దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకులకు ఇక్కడికి వచ్చాక వీసా జారీచేసేలా పదకొండు దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. మరో 9 దేశాలతోను సంప్రదింపులు సాగుతున్నాయని, దశల వారీగా ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు. భద్రత సంబంధ సమస్యలున్న దేశాలు మినహా అన్ని దేశాలతో ఇలాంటి ఒప్పందాలకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో పాకశాస్త్ర (కలినరీ) శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరామన్నారు. దీన్ని హైదరాబాద్ లేదా తిరుపతిలో ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్నారు. నిజాం నగల ప్రదర్శన దిశగా చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని బౌద్ధారామాల సందర్శకుల కోసం దేశంలోని బౌద్ధ కేంద్రాల అనుసంధానం చేపడతామన్నారు.

క్లీన్ ఇండియాలో భాగంగా విక్టోరియా టెర్మినస్‌తదితర ఆరు చారిత్రక స్థలాలపై ఓఎన్జీసితో ఒప్పందాలు కుదిరాయన్నారు. విశాఖ పరిసర తీరప్రాంత అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. చిరంజీవి బ్లడ్‌బ్యాంకును పుణ్యం బ్యాంక్‌గా అభివర్ణించిన టి.సుబ్బిరామి రెడ్డి, రక్త నిధికి ఎంపీల్యాడ్స్ నుండి రెండు అంబులెన్స్‌ల కోసం రూ.50 లక్షలు కేటాయిస్తానని చెప్పారు. విశాఖలో చిరంజీవి రక్త నిధిని ఏర్పాటు చేసి తమకూ పుణ్యం పంచాలని కోరారు. అందుకు చిరంజీవి.. రక్త నిధి ఏర్పాటులో చాలా ఇబ్బందులు ఉంటాయని, వాటిని భరిస్తానంటే ఆలోచిస్తానని చెప్పారు.

English summary
MP T Subbirami Reddy appealed Central Minister Chiranjeevi to launch a Chiranjeevi blood bank in Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X