వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్ ఆస్పత్రిలో ఆమర్ సింగ్: ఆరోగ్యం విషమం

By Pratap
|
Google Oneindia TeluguNews

Amar Singh
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ దుబాయ్ విమానాశ్రయంలో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను అక్కడే ఆసుపత్రిలో చేర్పించారు. 57 ఏళ్ల అమర్‌సింగ్, ఆరోగ్య పరీక్షల నిమిత్తం సింగపూర్‌కు వెళ్తూ దుబాయ్ విమానాశ్రయంలో స్పృహతప్పారని ఢిల్లీలోని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు.

ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అయితే నిలకడగా ఉందని తెలిపారు. అమర్‌సింగ్ కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో మూత్రపిండాల సమస్యలకు చికిత్స పొందారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

అమర్ సింగ్‌ను దుబాయ్‌లోని వెల్‌కేర్ ఆస్పత్రిలో చేర్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణపై సమాజ్‌వాదీ పార్టీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో చురుగ్గా వ్యవహరించారు.

చాలా కాలంగా అమర్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.

English summary

 ormer Samajwadi Party leader Amar Singh was admitted to a Dubai hospital on Monday after he fainted at the airport there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X