చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మం టిడిపిలో ముసలం: జగన్ ఇలాకాలో వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP Logo
ఖమ్మం/కడప/చిత్తూరు: డిసిసిబి చైర్మన్ పదవి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టింది. టిడిపి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు తన వర్గానికి చెందిన నాయకుడికి చైర్మన్ పదవి ఇప్పించుకొని పంతం నెగ్గించుకున్నారు. తన వర్గానికి చెందిన మువ్వల విజయ్ బాబుకు డిసిసిబి చైర్మన్ పదవి వచ్చేలా చక్రం తిప్పాడు. దీంతో తనకు చైర్మన్ పదవి రాలేదని బోడేపూడి రమేష్ బాబు అలకవహించారు. టిడిపికి రాజీనామా చేస్తానని, త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

విజయ్ బాబు, రమేష్‌ల వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చల్లబర్చే ప్రయత్నా చేసింది. చెరో రెండున్నర సంవత్సరాలు చైర్మన్‌గా ఉండాలని సూచించింది. అయితే, అధిష్టానం సూచనను బోడేపూడి రమేష్ బాబు అంగీకరించలేదు. పార్టీని వీడేందుకు రమేష్ బాబు సిద్ధమయ్యారు. కాగా, డిసిసిబి ఉపాధ్యక్షుడిగా సిపిఐకి చెందిన హేమంతరావును ఎన్నుకున్నారు. డిసిఎంఎస్ అధ్యక్షుడిగా అంజయ్య, ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి సుధాకర్ ఎన్నికయ్యారు.

వరంగల్ జిల్లా డిసిసిబి ఎన్నికల ఫలితాల వ్యవహారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు చేరింది. డిసిసిబి ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా వాయిదా వేయడంపై కాంగ్రెసు అభ్యర్థి జంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల నిలిపివేతను వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల్లో టిడిపి సహకారం వల్లే తాను గెలిచినట్లు డిసిసిబి చైర్మన్ రాజశేఖర రెడ్డి చెప్పారు.

కడప జిల్లా డిసిసిబి ఎన్నిక రేపటికి వాయిదా పడింది. డిసిసిబి ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నిన్నటి నుండి అదృశ్యం కావడం, ఈ రోజు చిత్తూరు జిల్లాలో దొరకడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఎన్నికలను రేపటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వాయిదాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యతిరేకిస్తోంది.

English summary
DCCB chairman: Khammam TDP in crisis
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X