కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్విస్ట్: గంతలు కట్టి రాత్రంతా తిప్పారని..కోర్టుకు వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

DCO attends before collector
కడప/హైదరాబాద్: కడప డిసిసిబి ఎన్నికలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. డిసిసిబి చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బుధవారం కడపలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఎన్నికలను రేపటి వరకు వాయిదా వేశారు. నిన్నటి నుండి కనిపించకుండా పోయిన డిసివో చంద్రశేఖర్ మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఎదుట ప్రత్యక్షమయ్యారు. మంగళవారం రాత్రి కళ్లకు గంతలు కట్టి తనను ఎవరో తీసుకు వెళ్లారని చంద్రశేఖర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

తనను రాత్రంతా ఓ వాహనంలో తిప్పి ఈ రోజు తెల్లవారుజామున చిత్తూరు జిల్లాలోని ములకల చెరువులో వదిలేశారని ఆయన కలెక్టర్‌కు చెప్పారు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతంలో వదిలి పెట్టినందువల్లే తాను అందుబాటులో లేనని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు ఒకరోజు డిసిసిబి ఎన్నికలు వాయిదా పడగా.. కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి వాటిని మరికొన్నిరోజులు వాయిదా వేయించేందుకు హుటాహుటిన కడప నుండి హైదరాబాదుకు బయలుదేరారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని, దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఇప్పటికే ఆరోపించారు. డిసిసిబి ఎన్నికల్లో జగన్ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇప్పటికే కాంగ్రెసు నేతలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లారు. వీరశివా రెడ్డి ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు కడప నుండి హైదరాబాదుకు బయలుదేరారు.

కడప జిల్లా డిసిసిబి ఎన్నిక రేపటికి వాయిదా పడటంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డిసిసిబి ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నిన్నటి నుండి అదృశ్యం కావడం, ఈ రోజు చిత్తూరు జిల్లాలో దొరకడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఎన్నికలను రేపటికి వాయిదా వేశారు.

English summary
DCO attends before collector
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X