వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడి కేసులో కోర్టులో టిడిపి ఎమ్మెల్యే లొంగుబాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chintamaneni Prabhakar
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ బుధవారం ఉదయం ఏలూరు కోర్టులో లొంగిపోయారు. ఆయనకు ఫ్యామిలీ కోర్టు మార్చి 6వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండును విధించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాల మేరకు చింతమనేని ఉదయం ఏలూరు కోర్టులో లొంగిపోయారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఎస్ఐ మోహన్ రావు పైన దాడి కేసులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చింతమనేని పైన 341, 332, 506, రెడ్‌విత్ 34 సెక్షన్‌ల కింద ఎమ్మెల్యేతో పాటు ఆయన గన్‌మెన్‌ల పైన కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఆయన లొంగిపోయారు.

చింతమనేని ప్రభాకర్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గత నెల ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. చింతమనేని కోసం అప్పుడు ఆరు పోలీసుల బృందాలు రంగంలోకి దిగినట్లుగా వార్తలొచ్చాయి.

పెదవేగి ఎస్సై బండి మోహన రావు సిబ్బందితో పినకడిమి గ్రామానికి వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. పేకాట ఆడుతున్న వారిని పట్టుకొని తీసుకు వెళ్తుండగా ఎమ్మెల్యే తన కారుతో తమను అడ్డగించారని, తనను చంపుతానంటూ బెదిరిస్తూ కొట్టారని ఎస్సై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గన్‌మన్, అనుచరులు శాసనసభ్యుడికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary

 Denduluru Telugudesam Party MLA Chintamaneni Prabhakar was surrendered in Eluru court on Wednesday morning by the orders of High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X