కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప ఉద్రిక్తం: వీరశివాపై జగన్ పార్టీ చెప్పులు, ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerasiva Reddy
కడప: జిల్లా డిసిసిబి ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. కడప జిల్లా కమలాపురం శాసనసభ్యుడు వీరశివా రెడ్డి కాన్వాయ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు బుధవారం చెప్పులు విసిరారు. డిసిసిబి కార్యాలయానికి వచ్చిన ఆయనపై అప్పటికే అక్కడకు చేరుకున్న జగన్ పార్టీ కార్యకర్తలు చెప్పులతో దాడి చేశరు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు డిసిసిబి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహణకు ముందు ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అదృశ్యమయ్యారు.

చంద్రశేఖర్ రాత్రి నుంచి కనిపించడం లేదు. తన భర్త అదృశ్యమయ్యారని ఎన్నికల అధికారి సతీమణి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారి అదృశ్యంతో ఎన్నికలు వాయిదా పడతాయేమోననే ఆందోళనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు భారీగా డిసిసిబి కార్యాలయానికి చేరుకున్నారు. అధికారి అదృశ్యం, కార్యకర్తలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

వీరశివా రెడ్డి కూడా అక్కడకు తన అనుచరులతో చేరుకున్నారు. ఈ సమయంలో జగన్ పార్టీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పైన చెప్పులు విసిరారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. తనపై జగన్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని వీరశివా రెడ్డి వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు అధికారి అదృశ్యం నేపథ్యంలో కలెక్టర్ చర్యలు చేపట్టారు. డిసిఎంఎస్ ఎన్నికల నిర్వహణాధికారి రమేష్‌కు డిసిసిబి ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అప్రమత్తం చేశారు. కాగా, కడప కలెక్టర్ నుంచి నివేదిక రాగానే చర్యలు చేపడతామని సహకార శాఖ అధికారులు అధికారి అదృశ్యంపై అన్నారు. కిడ్నాప్ విచారణపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. కాగా, డిసిసిబి ఎన్నికను వాయిదా వేయించేందుకే అధికారిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, అదృశ్యమైన అధికారి చంద్రశేఖర్‌ను పోలీసులు చిత్తూరు జిల్లాలో గుర్తించినట్లుగా తెలుస్తోంది.

English summary
YSR Congress Party activists thrown chappal at Kamalapuram Congress MLA Veerasiva Reddy's convoy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X