వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిని వెంటాడిన ప్రభాకరన్ తనయుడి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఎల్టిటీఇ చీఫ్ ప్రభాకరన్ 12 ఏళ్ల కుమారుడు బాలచంద్రన్ మృతి వెంటాడినట్లే కనిపించింది. పార్లమెంటు ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో గురువారం ఆయనకు ఆ సెగ తగిలింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజు గురువారంనాడు ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వలోని అన్నాడియంకె పార్లమెంటు సభ్యులు శ్రీలంకలోని తమిళుల సమస్యపై పార్లమెంటులో నినాదాలు చేశాయి. శ్రీలంక సైనికులు బాలచంద్రన్‌ను చంపిన తీరుపై ఇరు పార్టీల సభ్యులు గొంత కలిపి నిరసన వ్యక్తం చేశారు.

బాలచంద్రన్ హత్యను యుద్ధనేరంగా పరిగణించి అంతర్జాతీయ కోర్టులో తేల్చుకోవాలని జయలలిత బుధవారం డిమాండ్ చేశారు. చానెల్ 4 ప్రసారం చేసిన బాలచంద్రన్ ఫోటొలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. బాలచంద్రన్‌ను శ్రీలంక సైనికులు కిరాతకంగా కాల్సి చంపారని ఆరోపిస్తూ అందుకు సాక్ష్యంగా ఆ చానెల్ కొన్ని ఫొటోలను ప్రసారం చేసింది. ఆ డాక్యుమెంటరీని జెనీవా సమావేశంలో ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

చంపడానికి ముందు శ్రీలంక సైనికులు బాలచంద్రన్‌కు కొన్ని స్నాక్స్ ఇచ్చారు. ఈ కొత్త ఛాయాచిత్రాలు బాలచంద్రన్ ఎదురు కాల్పుల్లో గానీ, యుద్ధంలో గానీ చనిపోలేదని చెప్పడానికి బలమైన సాక్ష్యాలని చానెల్ 4 డాక్యుమెంటరీ డైరెక్టర్ కల్లుం మాక్రే అన్నారు. చానెల్ 4 డాక్యుమెంటరీ ప్రసారం చేసిన ఫొటోలను మార్ఫింగ్ చేశారని శ్రీలంక వాదిస్తోంది.

English summary
Death of 12-year-old Balachandran, son of LTTE chief Prabhakaran, seems to have started haunting President of India Pranab Mukherjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X