వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షెట్టార్‌కి షాక్: రాజీనామా, కాంగ్రెస్‌లోకి ఇద్దరుమంత్రులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yogeshwar-Raju Gowda
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వంలో మరోసారి సంక్షోభం తలెత్తింది. జగదీష్ షెట్టార్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులు సిపి యోగేశ్వర్, రాజు గౌడలు మంత్రివర్గం నుండి బయటకు వచ్చారు. వారు తమ పదవులకు రాజీనామా చేశారు. వారు తమ మంత్రి పదవులకు, ఎమ్మెల్యే పదవికి, బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారిద్దరు కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

తమ రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చామని రాజు గౌడ చెప్పారు. తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ బోపయ్యను కలిసి చెప్పామన్నారు. కాంగ్రెసులోకి వెళ్తున్న మరో నేత యోగేశ్వర్ అంతకుముందు అదే పార్టీ నుండి బిజెపిలో చేరారు. ఇతను చెన్నపట్నం నుండి గెలిచారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జెడి(ఎస్) నేతల నుండి గెలువగలిగే సురక్షిత నియోజకవర్గం వైపు ఆయన దృష్టి సారించారు.

మరో బిజెపి ఎమ్మెల్యే గోపాలకృష్ణ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అతను కూడా త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీని వీడటం ఖాయమైనప్పటికీ అతను కాంగ్రెసులో చేరుతారో లేదో అనే అంశం స్పష్టంగా తెలియదు. వీరి దారిలోనే మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

బిజెపిలో నాయకత్వ కొదువ

రాష్ట్ర బిజెపిలో నాయకత్వం లేమి స్పష్టంగా కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప వేరుగా అన్నారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారన్నారు.

యడ్డీపై ఫిర్యాదు చేస్తా

కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడిగా యడ్యూరప్పను తొలగించాలని తాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతానని కర్నాటక జనతా పార్టీ వ్యవస్థాపకులు పద్మనాభ ప్రసన్న కుమార్ గురువారం న్యూఢిల్లీలో అన్నారు. తాను యడ్డీ పైన సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పారు.

English summary
Two ministers C.P. Yogeshwar and Small Industries Minister Narasimha Nayak (also known as Raju Gowda) quit the Karnataka BJP ministry today. They were set to resign from the assembly and the party. The two ministers are said to be keen to join the Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X