హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హ్యాక్: పాక్ జిందాబాద్, హైదరాబాద్‌లా అని బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hackers target Bihar tourism website, post terror threat
పాట్నా/హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల తర్వాత పలు చోట్ల బాంబుల కలకలం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాలం(ఇంటర్నెట్)లో ఉగ్రవాద హెచ్చరికలు కలకలం రేపాయి. పార్లమెంటు దాడి నిందితుడు అఫ్జల్ గురు ఉరికి నిరసనగా హైదరాబాదు తరహా బాంబుపేలుళ్లు చేస్తామని బీహార్ పర్యాటక శాఖకు చెందిన వెబ్ సైట్లో హ్యాకర్లు హెచ్చరించారు.

బీహార్ వెబ్ సైట్‌ను హ్యాక్ చేసిన టెర్రరిస్టులు మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. హ్యాకింగ్‌కు గురైన వెబ్ సైట్లో వారు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రాశారు. బీహార్ పర్యాటక శాఖ మంత్రి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తమ వెబ్ సైటును హ్యాక్ చేశారని, హైదరాబాదు తరహా పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారని చెప్పారు.

ముంబయికి చెందిన ఓ ఐటి కంపెనీ ఈ సైట్ నిర్వహణ బాధ్యతలు నిర్వపిస్తోందని చెప్పారు. తమ వెబ్ సైట్‌ను హ్యాక్ చేసిన వారి పైన సంబంధిత చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు చేస్తే విచారిస్తామని పోలీసులు చెప్పారు.

తిరుపతిలో సూటుకేసు కలకలం

చిత్తూరు జిల్లాలోని తిరుమల బస్టాండు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సూటుకేసు కాసేపు కలకలం సృష్టించింది. సూటుకేసు విషయంపై సమాచారమందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు.

English summary
On Saturday morning, the Bihar tourism department's website, was attacked by unknown hackers. The hackers posted a threat to repeat Hyderabad-like blasts, besides message like 'Pakistan Zindabad'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X