హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేమున్నాం, అధైర్యమొద్దు: ప్రధాని, ప్రభుత్వానికి ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manmohan meets victims, says he’s here to share pain
హైదరాబాద్: ఎవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం చెప్పారు. ఆయన దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల ప్రాంతంలో పర్యటించారు. మన్మోహన్ ఉదయం పదకొండు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు నాయకులు స్వాగతం పలికారు.

అక్కడి నుండి నేరుగా సరూర్ నగర్‌లోని విక్టోరియా స్మారక గృహానికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అటు నుండి దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల ప్రాంతం చేరుకొని పరిశీలించారు. రోడ్డు మార్గంలో దిల్‌సుఖ్ నగర్ వచ్చారు. పేలుళ్ల ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మలక్‌పేట యశోదా ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. అటునుండి కొత్తపేటలోని ఓమ్నీ ఆసుపత్రిలోని క్షతగాత్రులను పరామర్శించారు. అటు నుండి తిరిగి విక్టోరియా స్మారక గృహానికి చేరుకున్నారు. అటు నుండి బేగంపేటకు వెళ్లారు. ప్రధాని వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ ఉన్నారు.

బేగంపేటకు చేరుకున్న ప్రధాని గవర్నర్, ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. పేలుళ్ల నేపథ్యంలో తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని... ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రభుత్వం చర్యలను అభినందించారు. మృతుల కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రజల దైర్యం, తెగువ అభినందనీయమని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రజలు సయంమనం పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

కాగా చైతన్య పురిలో ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది. బిజెపి కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కార్యకర్తల అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పీఎస్‌కు తరలించారు.

English summary
Three days after two powerful bombs rocked Hyderabad' Dilsukhnagar area, Prime Minister Manmohan Singh on Sunday visited the blasts sites here and called on the injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X