హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎల్‌కు భంగపాటు: ఆప్కోకు హనుమంతరావు గెలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: ఆప్కో చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి భంగపాటు ఎదురైంది. ఆయన బలపరిచిన గజ్జెల శ్రీనివాస్ ఓ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆయనకు కేవలం ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెసు పార్టీ అధికార పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఎం హనుమంతరావు ఆప్కో చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

హనుమంతరావుకు 19 ఓట్లు రాగా, శ్రీనివాస్‌కు ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో హనుమంతరావు 14 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెసు వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆప్కో చైర్మన్ పదవికి చివరి నిమిషంలో గజ్జెల శ్రీనివాస్‌ను డిఎల్ రవీంద్రా రెడ్డి పోటీకి దింపారు. దీంతో ఎన్నిక ఉత్కంఠగా మారింది.

గజ్జెల శ్రీనివాస్‌కు ఆయన ఓటుతో పాటు మరో నలుగురి ఓట్లు పడ్డాయి. దీంతో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసిన మిగతావారు ఎవరనే చర్చ కాంగ్రెసు పార్టీలో సాగుతోంది. డిఎల్ రవీంద్రా రెడ్డి చాలా కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వివిధ సందర్భాల్లో డిఎల్ రవీంద్రా రెడ్డి విమర్శిస్తూ వస్తున్నారు. పార్టీ అభ్యర్థిని ఓడించే ఉద్దేశంతోనే హనుమంతరావుకు వ్యతిరేకంగా గజ్జెల శ్రీనివాస్‌కు అప్కో చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో డిఎల్ రవీంద్రా రెడ్డి మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు.

English summary
The minister DL Ravindra Reddy's candidate G Srinivas has been defeated in APCO chairman elections by Congress candidate M Hanumanth Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X