హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుళ్లు: సైకిళ్లు పాతవే కానీ, ఆర్థిక కేంద్రం దుబాయ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

DSNR blasts: Bombs placed in Assembled Cycles
హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లలో ఉగ్రవాదులు ఉపయోగించిన రెండు సైకిళ్లు పాతవేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. గత గురువారం పేలుళ్ల కోసం నిందితులు రెండు సైకిళ్లను వాడారు. వీటిని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రెండు సైకిళ్లు కొత్తవి కాదని గుర్తించారు. పనికిరాని సైకిళ్ల విడి భాగాలతో వీటిని రూపొందించి పేలుళ్లకు ఉపయోగించారని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేస్తూ దర్యాప్తు సంస్థలకు నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సైకిళ్ల విషయంలో ఉగ్రవాదులు చాలా తెలివిగా వ్యవహరించారట. పేలుళ్లకు ఉపయోగించిన సైకిళ్లు పూర్తిగా విడి భాగాలతో రూపొందించినవి. చక్రం, రిమ్ములు, టైర్లు, బాడీలను వేర్వేరుగా సేకరించారు. పాత ఇనుప సామాను నుంచి వాటిని సేకరించి సైకిళ్లుగా మార్చారు. వాటికి కొత్త సీట్లను అమర్చారు. కాబట్టి సైకిళ్లు ఎక్కడ కొనుగోలు చేశారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పడం కష్టమని నిర్ధారించారు. నివేదిక నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు పాత ఇనుప సామాను సేకరించే వారి వివరాలు సేకరిస్తున్నాయి.

కాగా, పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఆర్థిక కేంద్రం దుబాయ్‌గా అనుమానిస్తున్నారు. భారత గడ్డపై ఉగ్రవాద దాడులు జరిపేందుకు అక్కడి నుండే నిధులు వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాసిన్ భత్కల్ వంటి ఉగ్రవాదుల ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తే ఇండియన్ ముజాహిద్దీన్ ఆర్థిక కేంద్రం దుబాయ్ కావొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని ఆధారాలు దొరికాయి: షిండే

పేలుళ్ల దోషులను అతి త్వరలోనే పట్టుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదివారం కోల్‌కతాలో వ్యాఖ్యానించారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు లభించాయని, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలనలు జరుపుతున్నామని, వాటి వివరాలు తెలిసిన వెంటనే దోషులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.

English summary
It is said that Terrorists used Assembled cycles in Dilsukhanagar bomb blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X