హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాదె, స్వామి, పూల..: గెలిచిన ఆరుగురు ఎమ్మెల్సీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

MLCs wins in elections
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లోని ఆరు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నాటికి అన్ని జిల్లాల్లో పూర్తయింది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది.

కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపును కరీంనగర్ అంబేడ్కర్ భవనంలో, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విశాఖలో, ఉభయ గోదావరి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఓట్లను నల్గొండలో జరిగింది. కొన్ని ఫలితాలు నిన్న తెలియగా ఈరోజు మరికొన్ని ఫలితాలు వచ్చాయి.

ఎక్కడి నుండి ఎవరు?

1. ఉత్తరాంధ్ర నియోజవర్గం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు.

2. కరీంనగర్ నియోజవర్గం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా పాతూరి సుధాకర్ రెడ్డి గెలుపొందారు.

3. కరీంనగర్ నియోజవర్గం పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా స్వామి గౌడ్ గెలుపొందారు.

4. నల్గొండ నియోజవర్గం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా పూల రవీందర్ గెలుపొందారు.

5. కృష్ణా, గుంటూరు నియోజవర్గం పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా బొడ్డు నాగేశ్వర రావు గెలుపొందారు.

6. ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గం నుండి పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా రవికిరణ్ వర్మ గెలుపొందారు.

English summary
Gade Srinivasulu Naidu won in Uttarandhra teachers constituency on Monday. He won second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X