హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైల్వేసహాయ మంత్రి కోట్ల ఇలాకాకు అంతంత మాత్రమే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kotla Suryaprakash Reddy
హైదరాబాద్: రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి ప్రాధాన్యత లభిస్తుందని అందరు భావించారు. అయితే, ఎపికి ఏమో కాని కర్నూలే కనిపించకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. కోట్ల మంత్రిగా ఉన్నందున ఎపికి మంచి ప్రాజెక్టులు వస్తాయని భావించామని కానీ, ఒరిగిందేమీ లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. హైదరాబాద్-కర్నూలు మధ్య ఒక ఎక్స్‌ప్రెస్ రైలు, కర్నూలు-నంద్యాల మధ్య ప్యాసింజర్ రైలు, కర్నూలులో రైల్వే వాగన్ వర్క్ షాప్ మినహా వచ్చిందేమీ లేదంటున్నారు.

కర్నూలు జిల్లాలో గత కొన్నేళ్లుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు వస్తాయని భావించినప్పటికీ అది నెరవేరలేదంటున్నారు. పెండింగు ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందనుకుంటే నిరాశ ఎదురయిందని అంటున్నారు. పాత ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందని చెబుతున్నారు. కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ పేరు కర్నూలు సిటీగా మార్చాలన్న ప్రతిపాదన గురించి, నగరం నుంచి మంత్రాలయానికి రైల్వే మార్గం, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రిజర్వేషన్ కౌంటర్ విస్తరణలపై స్పందన లేదంటున్నారు.

కర్నూలు రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్ సౌకర్యం తదితర వాటిపై కూడా ఎలాంటి ప్రకటన లేదని నిట్టూరుస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని ముందుగా ప్రచారం జరిగినా దానికి బదులు వర్క్ షాప్ ప్రతిపాదించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాగన్ల వర్క్ షాప్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నా కార్యరూపం దాల్చే విషయమై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ నుండి జోధ్‌పూర్, గాంధీధామ్, త్రివేండ్రం వెళ్లేందుకు కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. విశాఖ నుండి ముంబయికి వారానికి రెండు రోజులు నడుస్తున్న రైలును ఇక రోజు నడుపనున్నారు. విశాఖ-నాందేడ్ మధ్య వారానికి రెండురోజులు నడుస్తున్న రైలును మూడు రోజులకు పెంచారు. హౌరా-చెన్నై ఎసి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర రైళ్లు విశాఖ నుండి వెళ్లనున్నాయి. దీంతో విశాఖకు కొంతమేర ఆశా జనకమే. విజయవాడకు మాత్రం అన్యాయం జరిగిందంటున్నారు.

English summary
Railway Minister Pawan Kumar Bansal will present the Railway Budget 2013-14. He will be the first Congress minister in 17 years to present the railway budget. Bansal took over as the railway minister after the Trinamool Congress (TMC) withdrew its support from the UPA government on question of popular policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X